Student sucide: ఆత్మహత్య చేసుకోవడం ఎలాగో నటిస్తూ.. పాఠశాల విద్యార్థి మృతి.. కుర్చీ పైకి ఎక్కి..
ఒక్కోసారి మనిషి ఆకతాయి తనంతో చేసే పనులు వారి జీవితాన్నే అంతం చేస్తాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తమిళనాడులో ఓ 11 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకోవడం ఎలాగో
ఒక్కోసారి మనిషి ఆకతాయి తనంతో చేసే పనులు వారి జీవితాన్నే అంతం చేస్తాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తమిళనాడులో ఓ 11 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకోవడం ఎలాగో నటించి తన సోదరులకు చూపించాలనుకున్నాడు. అదే అతనిపాలిట శాపంగా మారింది. ఆయువు తీసింది. ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నై పుళల్ సమీపంలో పుళల్ సమీపంలోని బుద్దాగరం గ్రామం కామరజర్ నగర్‌కు చెందిన శ్రీనివాసన్ రెండో కుమారుడు కార్తీక్. అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 24 రాత్రి తన ఇద్దరు సోదరులతో కలిసి నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలో వారికి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలీదు కానీ తన సోదరులకు ఆత్మహత్య చేసుకోవడం ఎలాగో చూపిస్తానంటూ గదిలో పరుపు మీద కుర్చీ వేసుకుని, కుర్చీపైకి ఎక్కి నిలబడి ఫ్యాన్ కొక్కానికి నైలాన్ తాడు కట్టాడు, మరో కొనను కార్తీక్ మెడకు చుట్టుకున్నాడు. ఈ క్రమంలో కార్తీక్ నిలబడిన కుర్చీ తూలి కింద పడిపోయింది. దాంతో కార్తీక్ మెడకు నైలాన్ తాడు బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పుళల్ పోలీసులు కార్తీక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

