Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇంటర్నెట్ లో చాలా రకాల వీడియోలు ఉంటాయి. ఇటీవల రకరకాల వంటలకు సంబంధించిన వీడియోలు
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇంటర్నెట్ లో చాలా రకాల వీడియోలు ఉంటాయి. ఇటీవల రకరకాల వంటలకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. స్ట్రీట్ వ్యాపారులు కొత్త కొత్త ప్రయోగాలను నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఒక్కోసారి అవి బెడిసి కొట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి పిజ్జాను వెరైటీగా ట్రై చేశాడు. అతడి చర్యను చూసిన పిజ్జా ప్రియులు తమ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. పిజ్జా పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. జున్ను, మొక్కజొన్న, పుట్టగొడుగులు, పనీర్‌తో తయారైన ఈ పదార్థాన్ని తినేందుకు భోజన ప్రియులు ఆబగా ఎదురుచూస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి సాస్, చీజ్‌కు బదులుగా ఐస్‌క్రీమ్ వేసి పిజ్జా తయారు చేశాడు. ఈ క్లిప్ లో ఒక వ్యక్తి మొదట చాక్లెట్ సాస్‌ను పిజ్జా బేస్‌పై అప్లై చేసి, ఆపై కూరగాయ ముక్కలు వేశాడు. దీనిని ఓవెన్ లో ఉంచి, పిజ్జా తయారు చేసాడు. అనంతరం పిజ్జాపై వెనిల్లా ఐస్ క్రీం, స్ట్రాబెర్రీ ఐస్ క్రీం యాడ్ చేసాడు. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని వేలాది మంది వీక్షించగా చాలా మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘తిండిని వదిలేయండి, ఇది చూడటానికి అసహ్యంగా ఉంది’ అని ఓ వినియోగదారు రాశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

