MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి ఎమ్మెల్యే ఎస్‌పీ వెంకటేశ్వరన్ లిట్టారంపట్టి ఏరియాలోని ఇలక్కియంపట్టి ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్లు
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి ఎమ్మెల్యే ఎస్‌పీ వెంకటేశ్వరన్ లిట్టారంపట్టి ఏరియాలోని ఇలక్కియంపట్టి ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్లు అశుభ్రంగా ఉండటాన్ని గుర్తించి మండిపడ్డారు. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్వయంగా ఆయనే శుభ్రం చేశారు. ప్రతిరోజూ ఇలానే శుభ్రంగా ఉంచుకోవాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. పాఠశాల ఆవరణ మొత్తం దోమల మందు చల్లించాలని బీడీవోకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అభివృద్ధి నిధుల నుంచి అత్యాధునిక సౌకర్యాలతో కొత్త మరుగుదొడ్డి నిర్మిస్తామన్నారు. అందులో వినియోగించేందుకు శానిటరీ న్యాప్‌కిన్ డిస్పోజల్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓ అసెంబ్లీ సభ్యుడు ప్రభుత్వ పాఠశాలలోని మరుగుదొడ్డిని శుభ్రం చేయడంపై అన్నివర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

