Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!
బీహార్‌లోని నవాడా జిల్లాలో ఆగస్టు 29న ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ అబ్బాయి వెంటపడింది. ఆ యువతి బారినుంచి తప్పించుకునేందుకు..
బీహార్‌లోని నవాడా జిల్లాలో ఆగస్టు 29న ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ అబ్బాయి వెంటపడింది. ఆ యువతి బారినుంచి తప్పించుకునేందుకు యువకుడు పారిపోతుండగా యువకుడి వెంట తన బంధువులతో కలిసి పరుగులు తీసింది యువతి. ప్రస్థుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ నవాడా జిల్లాలోని రోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహకర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీడియా కథనాల ప్రకారం నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులి ప్రాంతానికి చెందిన అమ్మాయికి అదే ప్రాంతానికి చెందిన అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. అమ్మాయి కుటుంబీకులు మూడు నెలల క్రితమే ఈ యువకుడితో అమ్మాయి పెళ్లి నిశ్చయించారు. ముందుగానే పల్సర్ బైక్, 50 వేల నగదును కూడా కట్నంగా ఇచ్చారు. పెళ్లి సమయం దగ్గరపడినప్పుడల్లా ఆ యువకుడు ఇప్పుడు పెళ్లి చేసుకోనని పెళ్లి తేదీని వాయిదా వేస్తూ వచ్చాడు. ఆగస్టు 29న కుటుంబ సమేతంగా బజారుకు వెళ్లిన యువతికి హఠాత్తుగా అబ్బాయి కనిపించాడు. యువతి కుటుంబ సభ్యుల సాయంతో పరుగు పరుగున బాలుడిని పట్టుకుంది. తనని పెళ్లి చేసుకోవాలని పదే పదే అడిగింది.. ఆ సమయంలో భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసుల జోక్యంతో విషయం అదుపులోకి వచ్చింది. అక్కడున్న కొందరు ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Pawan Kalyan: వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).
Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

