Uttar Pradesh: బాబా చెప్పాడంటూ సజీవ సమాధికి యువకుడు.. కట్ చేస్తే సీన్ రివర్స్..(వీడియో)
టెక్నాలజీ యుగంలోనూ ప్రజల్లో మూఢనమ్మకాలు పోవడం లేదు. కొందరు దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు చెప్పే మాయమాటలతో నిండు జీవితాలను పణంగా పెడుతున్నారు కొందరు యువకులు.
టెక్నాలజీ యుగంలోనూ ప్రజల్లో మూఢనమ్మకాలు పోవడం లేదు. కొందరు దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు చెప్పే మాయమాటలతో నిండు జీవితాలను పణంగా పెడుతున్నారు కొందరు యువకులు. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే జరిగింది. స్వామీజీలు, బాబాల మాయమాటలతో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు ఓ యువకుడు. అయితే పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతమైంది.ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లోని తాజ్‌పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు ఓ యువకుడిని మాయమాటలతో నమ్మించారు. మనల్ని మనం ఆత్మార్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడని చెప్పారు. అది కూడా దేవీ నవరాత్రులకు ముందే జరిగిపోవాలని హడావుడి చేశారు. దీంతో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు శుభమ్ గోస్వామీ అనే యువకుడు. అందుకు ఆరడుగుల గొయ్యి తవ్వి, అందులో గోస్వామిని పెట్టి గొయ్యిపైన వెదురుబొంగులతో కప్పేసి, దానిపైన మట్టిని పూడ్చారు. ఆ తర్వాత గొయ్యిలోకి వెళ్లి పోయాడు యువకుడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని యువకుడిని సమాధిలో నుంచి బయటకి తీశారు. ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు. శివకేశవ్ దీక్షిత్, మున్నాలాల్ అనే పూజారులు సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారన్నారు. దీంతో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు సమయానికి అక్కడికి వెళ్లడంతో ముప్పు తప్పింది. సమాధినుంచి యువకుడిని రక్షించారు. నిందితులు మున్నాలాల్, శివ కేశవ్, దీక్షిత్ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

