Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Anil kumar poka

|

Updated on: Nov 02, 2022 | 10:21 PM

కరోనా మహమ్మారి నుంచే ఇంకా పూర్తిగా బయటపడలేదు. మళ్లీ కొత్త కొత్త వైరస్‌లు దడ పుట్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా మరో వైరస్‌ ముప్పు ముంచుకొస్తోంది.


కరోనా మహమ్మారి నుంచే ఇంకా పూర్తిగా బయటపడలేదు. మళ్లీ కొత్త కొత్త వైరస్‌లు దడ పుట్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా మరో వైరస్‌ ముప్పు ముంచుకొస్తోంది. రష్యా గబ్బిలాల్లో డేంజరస్‌ వైరస్‌ను గుర్తించారు పరిశోధకులు. రష్యాలోని గబ్బిలాల్లో 2020లోనే ఖోస్టా-1, ఖోస్టా-2 అనే రెండు రకాలను గుర్తించారు పరిశోధకులు. అయితే, దీంతో మనుషులకు ఎలాంటి ముప్పు ఉండదని తొలుత భావించారు. కానీ తాజా పరిశోధనల్లో కరోనా వైరస్‌లా ఇది మనుషులకు కూడా వ్యాపిస్తుందని తేల్చారు. ఖోట్సా–2 అనే వైరస్‌లో స్పైక్‌ ప్రొటీన్లను గుర్తించారు. ఇవి మనుషుల్లోని కణాల్లోకి చొచ్చుకుపోయి, విషపూరితం చేస్తాయని తేల్చారు. అమెరికాలోని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందం రష్యా గబ్బిలాలపై అధ్యయనం నిర్వహించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి నుంచి బ్లడ్‌ సీరం సేకరించి పరీక్షలు చేశారు. ఈ వైరస్‌ ఆ వ్యాక్సిన్‌ను కూడా తట్టుకోగలదని తేల్చారు. చివరకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారి యాంటీ బాడీలు కూడా ప్రభావం చూపలేకపోయాయంటే.. ఖోస్టా-2 ఎంత డేంజరసో చెప్పొంచంటున్నారు. సార్స్​-కొవ్​-2తో ఖోస్టా-2 వైరస్​ కలిస్తే.. మరింత ముప్పు ఉండొచ్చని హెచ్చరించారు. సార్బీకోవైరస్‌ల నుంచి రక్షణ కల్పించే యూనివర్సల్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Nov 02, 2022 10:03 PM