Bath Tub: మనుషుల స్నానానికి బాత్‌ మెషీన్‌..! అందుబాటులోకి ఎప్పుడంటే..? పూర్తి వివరాలు..

Bath Tub: మనుషుల స్నానానికి బాత్‌ మెషీన్‌..! అందుబాటులోకి ఎప్పుడంటే..? పూర్తి వివరాలు..

Anil kumar poka

|

Updated on: Nov 03, 2022 | 7:22 PM

బట్టలు ఉతకడానికి వాషింగ్‌ మెషీన్లు ఉన్నట్లుగానే .. మనుషుల స్నానం కోసం వాషింగ్‌ మెషీన్‌ తయారు చేస్తోంది ఓ జపనీస్‌ కంపెనీ. ఒసాకాకు చెందిన ‘సైన్స్‌ కో లిమిటెడ్‌’ దీన్ని రూపొందిస్తోంది.


ఫైన్‌ బబుల్‌ టెక్నాలజీతోపాటు వివిధ సెన్సర్లు, కృత్రిమ మేధ ఆధారంగా ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాదు విశ్రాంతినిచ్చే సంగీతం వినిపిస్తూ, వాటర్‌ రెసిస్టెంట్‌ డిస్‌ప్లేలో ఫొటోలు కూడా చూపిస్తూ.. మరింత హాయిగొలిపేలా చేస్తుంది. అయితే ఇలా మనుషుల వాషింగ్‌ మెషీన్‌ తయారు చేసే ఐడియా కొత్తదేం కాదు. సాన్యో ఎలక్ట్రిక్‌ 1970ల్లోనే ‘అల్ట్రాసోనిక్‌ బాత్‌’ పరికరాన్ని తయారు చేసింది. అది 15 నిమిషాల్లోనే శరీరాన్ని శుభ్రం చేయడంతోపాటు ఆరబెట్టడం, మసాజ్‌ చేయడం కూడా పూర్తిచేస్తుంది. కానీ దానిపై వెల్లువెత్తిన సందేహాలతో మార్కెట్లోకి తీసుకురాలేదు. ఇన్నేళ్ల తర్వాత సైన్స్‌ కో లిమిటెడ్‌ చైర్మన్‌ యసాకీ అయోమా దీనిపై దృష్టి పెట్టాడు. ఇంతకీ ఈ మెషీన్‌ను కొనాలనుకుంటే 2025 దాకా ఆగాల్సిందే. 2024 చివరికల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, 2025లో అందరికీ అందుబాటులోకి తెస్తామని సైన్స్‌ కో సంస్థ చెబుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Published on: Nov 03, 2022 07:22 PM