House on Moon:చందమామపై ఇల్లు కడదామా.? ఈ దశాబ్దంలోనే సాధ్యమన్న నాసా.. వీడియో.
ఆ చందమామలో తేలిపోదామా హాయిహాయిగా అని పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నది అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా. ఈ దశాబ్దంలోనే చంద్రునిపై నివాసాల కల నెరవేరనున్నట్టు అంచనా వేస్తుంది.
సుదీర్ఘకాలం చంద్రునిపై నివసించడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడం కోసం మానవ రహిత ఓరియన్ అంతరిక్ష నౌకను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ నౌక గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నాలుగున్నర లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. మరో 60 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తే చంద్రున్ని చేరుకున్నట్టే. ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా దానిని ప్రయోగించారు. చంద్రునిపై నివాసాల ఏర్పాటుకు అవసరమైన కీలక సమాచారాన్ని ఈ మిషన్ సేకరిస్తుందని మిషన్ అధికారి హోవార్డ్ హూ తెలిపారు. చంద్రధూళిని, సౌరశక్తిని ఉపయోగించి ఇటుకలను తయారు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో మనుషుల్ని చంద్రునిపైకి పంపించాలని అనుకొంటున్నట్టు ఆయన చెప్పారు. అయితే వారంతా శాస్త్రవేత్తలే అయి ఉంటారని ఆయన తెలిపారు. ఇది కేవలం అమెరికాను దృష్టిలో పెట్టుకొని రూపొందించింది కాదని, ప్రపంచ దేశాలన్నీ ఇందులో పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓరియన్ తరహా అంతరిక్ష నౌకల్లోనే మనుషుల్ని చంద్రునిపైకి చేరవేయాల్సి ఉంటుందని కూడా హోవార్డ్ హూ అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

