David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. అదరహో అనిపించేలా వార్నర్ న్యూలుక్..
టాలీవుడ్ హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ సోషల్‌మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ వీడియోను పంచుకునే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారు.
టాలీవుడ్ హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ సోషల్‌మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ వీడియోను పంచుకునే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారు. ఇటీవల బాహుబలి, పుష్ప గెటప్‌లతో అదరగొట్టిన వార్నర్ తాజాగా డీజే టిల్లు లుక్‌తో దుమ్ము లేపారు. డీజే టిల్లు సినిమాలోని ఓ సీన్‌ను మార్ఫింగ్ చేసి వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.వార్నర్ చేసిన ఈ పోస్ట్‌పై అతని అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కిర్రాక్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప సినిమా పార్ట్ 2లో వార్నర్ హీరోగా నటించాలని ఓ అభిమాని అంటే, వార్నర్ భారత పౌరసత్వం తీసుకోవాలని, మీకు ఇక్కడ స్వాగతం పలుకుతామని మరో అభిమాని రాసుకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

