Hognose snake: పాముల ప్రపంచానికి డ్రామా రాణి.. ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా.. చనిపోయినట్లు నటించి..
ప్రాణాల మీదకు వస్తే.. మనుషులే కాదు జంతువులు కూడా ట్రిక్కులు ప్లే చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటననే ఒకటి వెలుగులోకి వచ్చింది. మనుషులు పాములను చూస్తే సహజంగానే భయపడిపోతారు. ఆ పాముల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు.
ప్రాణాల మీదకు వస్తే.. మనుషులే కాదు జంతువులు కూడా ట్రిక్కులు ప్లే చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటననే ఒకటి వెలుగులోకి వచ్చింది. మనుషులు పాములను చూస్తే సహజంగానే భయపడిపోతారు. ఆ పాముల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రాణాలను కాపాడుకుంటారు. అలాగే పాములు కూడా మనషుల దాడి నుంచి తప్పించుకునేందుకు చూస్తుంది. అప్పటి వరకు బుసలు కొడుతూ, కోరలు చాచుతూ ముందుకు వెళ్లిన పామును ఓ వ్యక్తి తన చేతితో టచ్ చేశాడు. ఇంకేముంది ఆ పాము చనిపోయినట్లు నటించింది. తన శరీరాన్ని తిప్పుతూ.. విగతజీవిలా పడిపోయినట్లు యాక్ట్ చేసింది. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాము నటన నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంది. ఏం యాక్టింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ పాము హగ్నోస్ జాతికి చెందినది. ఈ పాములు తమను తాము రక్షించుకోవడానికి ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి విషపూరితమైన పాములు కావని, మనుషులకు ఎలాంటి హాని కలిగించవంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

