Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Anil kumar poka

|

Updated on: Nov 14, 2022 | 8:54 AM

పచ్చబొట్టు ఉందనే కారణంగా ఓ యువకుడు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అతడు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. కుడిచేతి భాగంలో మతపరమైన పచ్చబొట్టు ఉందనే కారణంగా కేంద్ర పోలీసు దళాలు, జాతీయ దర్యాప్తు సంస్థ..


పచ్చబొట్టు ఉందనే కారణంగా ఓ యువకుడు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అతడు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. కుడిచేతి భాగంలో మతపరమైన పచ్చబొట్టు ఉందనే కారణంగా కేంద్ర పోలీసు దళాలు, జాతీయ దర్యాప్తు సంస్థ తదితర బలగాల్లో ప్రవేశానికి నిరాకరించారు. అనర్హుడిగా ప్రకటితుడైన ఓ యువకుడు అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైద్యపరీక్షలో తనకు ఎలాంటి లోపాలూ లేవని తేలిందనీ, చేతి మీది పచ్చబొట్టును చిన్నపాటి లేజర్‌ శస్త్రచికిత్సతో తొలగించుకుంటానని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించాడు. అయితే, సెల్యూట్‌ చేయడానికి ఉపయోగించే కుడిచేతి మీద మతపరమైన పచ్చబొట్టు ఉండటం కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధమని అధికారుల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. రెండు వారాల్లోపు పచ్చబొట్టు తొలగించుకొని కొత్త వైద్యపరీక్షలకు బోర్డు ముందు హాజరుకావడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ హైకోర్టు కేసును ముగించింది. నియామకానికి అర్హుడని వైద్యబోర్డు నిర్ధరిస్తే, చట్టానికి అనుగుణంగా అతడిని రిక్రూట్‌ చేసుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..