Dog Viral video: పైశాచికత్వం.. కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్..! డాక్టర్‌పై జంతు హింస చట్టం కేసు..

పైశాచికత్వానికి పరాకాష్ఠ అంటే ఇదేనేమో. ఓ కారు డ్రైవర్ కుక్క మెడకు తాడు కట్టి ఆపై కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో మరోమార్గం లేని శునకం దాని వెనక పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకునే

Dog Viral video: పైశాచికత్వం.. కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్..! డాక్టర్‌పై జంతు హింస చట్టం కేసు..

|

Updated on: Nov 18, 2022 | 9:58 AM


పైశాచికత్వానికి పరాకాష్ఠ అంటే ఇదేనేమో. ఓ కారు డ్రైవర్ కుక్క మెడకు తాడు కట్టి ఆపై కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో మరోమార్గం లేని శునకం దాని వెనక పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో దారుణం ఏంటంటే.. కుక్క మెడకు తాడు కట్టి కారుతో ఈడ్చుకెళ్లిన ఆ వ్యక్తి డాక్టర్ రజనీష్ గల్వా కావడం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డాక్టర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కారు వెనుక బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘోస చూడలేక ఆవ్యక్తే.. కారుకు అడ్డంగా తన బైకును నిలిపి శునకాన్ని రక్షించాడు. డాగ్ హోం ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థకు ఫోన్ చేసి సమాచారమివ్వడంతో దానిని ఆసుపత్రికి తరలించారు. ఆ వీధికుక్క నిత్యం తన ఇంటి వద్దే కాపుకాస్తుండడంతో.. దానిని వదిలించుకోవడానికే ఇలా చేసినట్టు సదరు డాక్టర్ రజనీష్ చెప్పారు. కాగా డాక్టర్‌పై జంతు హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us