AP news: చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి ఒక్కసారిగా తన్మయత్వం.. వీడియో.
కాకినాడ జిల్లా.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. అచ్చం దశావతారం సినిమా సీన్ రిపీట్ అయింది.
కాకినాడ జిల్లా.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. అచ్చం దశావతారం సినిమా సీన్ రిపీట్ అయింది. ఆ సినిమాలో విష్ణుమూర్తి విగ్రహం ఏ విధంగా ఒడ్డుకు కొట్టుకొచ్చిందో అదే విధంగా.. కడలి నుంచి అయ్యప్ప స్వామి విగ్రహం ఉద్భవించింది. నవంబరు 14 సాయంత్రం చేపల వేటకు వెళ్లిన సూరాడ శివ అనే మత్స్యకారుడు వలలో అయ్యప్ప స్వామి విగ్రహం ప్రత్యక్షమైంది. చేపల కోసం వేసిన వల బరువుగా అనిపించడంతో.. దాన్ని లాగిన మత్స్యకారుడు.. లోపల అయ్యప్ప విగ్రహం ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. తోటి మత్స్యకారుల సహాయంతో ఒడ్డుకి చేర్చాడు. ఆపై విగ్రహాన్ని సుబ్బంపేట రామాలయాలని తీసుకెళ్లారు.విషయం తెలియడంతో అక్కడికి స్థానికులు పోటెత్తుతున్నారు. రాతితో చెక్కబడి.. చెక్కుచెదరని సుందర రూపంతో ఉన్న మణికంఠుని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలలోని అయ్యప్ప స్వామి భక్తులకు తెలియడంతో ఒక్కొక్కరిగా చేరుకుని పూజలు చేస్తున్నారు. కడలి నుంచి తమ వల ద్వారా ఒడ్డుకు చేరిన అయ్యప్ప విగ్రహానికి గుడి కట్టే ఆలోచనలో ఉన్నారు స్ధానిక మత్స్యకారులు. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు మాలలు ధరించే సమయం. అందునా అయ్యప్ప విగ్రహాన్ని ఎవ్వరూ నిమజ్జనం చేయరు. దీంతో ఆ అయ్యప్ప విగ్రహం ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందో అర్థం కావడం లేదు. ఇది హరిహర పుత్రుడి మహత్యమే అంటున్నారు భక్తులు. శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వానికి లోనవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

