Bride market: పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా..? అయితే ఒక్క సారి ఈ సంతకు వెళ్లండి.. వీడియో.
పెళ్లీడుకు వచ్చిన వారికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు తెగ కష్టపడుతూ ఉంటారు. వారికి సరైన జోడి కోసం బంధువులను, తెలిసిన వారి గురించి వాకబు చేస్తుంటారు. గుణ గణాలు, కుటుంబం గురించి ఆరా తీస్తుంటారు.
మాండ్య జిల్లాలోని ఆదిచుంచనగిరిలో ఒక్కలిగ కులస్థులు.. వధూవరుల సమ్మేళనాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు ఈ సమ్మేళనానికి తరలివచ్చారు. 250 మంది అమ్మాయిలు రాగా.. వారిని చూసుకోవడానికి 11 వేల 775 మంది యువకులు వచ్చారు. వీరందరూ యువ రైతులే కావడం విశేషం. పెళ్లిచూపులకు వచ్చిన యువకుల క్యూలైన్ చూసి అందరూ షాక్ అయ్యారు. మరోవైపు.. బిహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలోనూ ఇలాంటి సమ్మేళనమే జరుగుతోంది. ఇందులో సౌరత్ సభ పేరుతో వరులను విక్రయానికి పెడతారు. మైథిల్ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ప్రజలు తమ కుమార్తెలతో పాటు వచ్చి.. తమకు నచ్చిన వరులను ఎంపిక చేసుకుంటారు. వరుడిని సెలెక్ట్ చేసుకునే ముందు.. వధువు తరఫున వారు వరుడి అర్హతలు, వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటారు. ఈ సంప్రదాయం కర్నాటక రాజవంశస్థుల కాలం నుంచి ఆచరిస్తూ వస్తున్నారు. వివాహాలను సులభతరం చేయడానికి రాజా హరిసింగ్ ఈ మార్కెట్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇందులో వరకట్న రహిత వివాహాలు చేయడం మరో లక్ష్యంగా చెబుతారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

