Watch Video: అరెరె ఎంత పనైంది.. లైవ్‌లో ఉండగా రిపోర్టర్‌కు చక్కిలిగింతలు పెట్టిన గున్న ఏనుగు.. నెట్టింట నవ్వుల్ నవ్వుల్..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇవి నెటిజన్లను నవ్వించడంతోపాటు.. వారి హృదయాలను ఆకట్టుకుంటుంటాయి.
Elephant Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇవి నెటిజన్లను నవ్వించడంతోపాటు.. వారి హృదయాలను ఆకట్టుకుంటుంటాయి. అయితే.. కొన్ని సార్లు జంతువులు ప్రవర్తన భలే విచిత్రంగా ఉంటుంది. అవి చేసే పనులు చూస్తే అందరికీ నవ్వొస్తుంది. అన్ని సార్లు కూడా అలా ఉండదు.. కొన్నిసార్లు జంతువులు వణుకుపుట్టించేలా చేస్తాయి. కొన్ని జంతువుల ప్రవర్తన అచ్చం మనుషుల్లానే ఉంటుంది. తాజాగా.. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెన్యాలో ఓ రిపోర్టర్ ఏనుగుల గుంపు వద్ద నిలబడి.. రిపోర్టింగ్ చేస్తుంటాడు. ఈ సయమంలో ఓ ఏనుగు పిల్ల వచ్చి అతనికి చక్కిలిగింతలు పెడుతుంది. వైరల్ అవుతోన్న వీడియోలో ఈ ఏనుగు పిల్ల చేసిన పని ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.
కెన్యాలోని నైరోబీలోని షెల్‌డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ లో KBC జర్నలిస్ట్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు.. ఈ సరదా ఘటన చోటుచేసుకుంది. జంతు పునరావాస కేంద్రమైన వైల్డ్ లైఫ్ ట్రస్ట్‌లో ఏనుగులు, ఖడ్గమృగాలు ఉంటాయి. ఈ క్రమంలో అక్కడ రిపోర్టింగ్ కోసం వెళ్లిన.. కేబీసీ రిపోర్టర్ ఆల్విన్ ప్యాటర్సన్‌కు వింత అనుభవం ఎదురైంది. గున్న ఏనుగుల వద్ద నిలబడి టీవీలో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా.. ఓ ఏనుగు పిల్ల చక్కిలిగింతలు పెట్టడానికి ప్రయత్నించింది. దీంతో వార్తా నివేదిక సమయంలో అంతరాయం కలిగింది.
వీడియో చూడండి..
View this post on Instagram
గున్న ఏనుగు తన తొండెంతో రిపోర్టర్‌ను ఎలా ఆటపట్టించిందో ఈ వీడియోలో చూడవచ్చు. రిపోర్టింగ్ చేస్తుండగా.. ఏనుగు తన తొండాన్ని తలపైనుంచి వేసి.. ముక్కు దగ్గర ఉంచుతుంది. ఈ సమయంలో రిపోర్టింగ్ చేస్తున్న వ్యక్తి.. నవ్వుతూ కనిపిస్తాడు.
ఆల్విన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో (@alvin.kaunda) వీడియోను పంచుకోగా.. ఇది నెట్టింట వైరల్ అయ్యింది. ఇది చూసి అందరూ నవ్వుకోవడంతోపాటు.. పలు ఫన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా నయం ఏం చేయలేదంటూ పేర్కొంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..