- Telugu News Photo Gallery Cherry Benefits: cherries are beneficial for pregnant woman know the details here
Cherry Benefits: గర్భిణులకు వరం చెర్రీ పండ్లు.. రోజూ తింటే ఆ సమస్యే ఉండదు.. ఈరోజే ఆహారంలో చేర్చుకోండి..
చెర్రీస్‌లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇవి శరీరంలోని అన్ని సమస్యలను తొలగిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Updated on: Nov 17, 2022 | 12:29 PM

చెర్రీ పండ్లలో విటమిన్ సి, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, చెర్రీలో అనేక రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇది శరీరంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కావున చెర్రీస్ తినడం వల్ల కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చెర్రీస్ గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. గర్భధారణ సమయంలో చెర్రీస్ తీసుకుంటే.. ఇది శిశువు అభివృద్ధిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కావున గర్భంలోని శిశువులకు చాలా మేలు జరుగుతుంది.

మహిళలు తమ ముఖాన్ని సహజసిద్ధంగా చూసుకోవాలంటే, వారి ఆహారంలో చెర్రీస్ తప్పనిసరిగా చేర్చుకోవాలి. యాంటీ ఏజింగ్ లక్షణాలు చెర్రీలో ఉన్నాయి. దాని సహాయంతో వృద్ధాప్య లక్షణాలను తగ్గించుకోవచ్చు.

మెలటోనిన్, ఆంథోసైనిన్ చెర్రీస్‌లో కనిపిస్తాయి. ఇవి నిద్రను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. రాత్రిపూట సరిగ్గా నిద్రపపట్టకపోయినా.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నా చెర్రీ పండ్లను తీసుకోవడం మంచిది. క్రమంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన నిద్ర పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

చెర్రీలో స్థూలకాయం నిరోధక ప్రభావం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన చెర్రీలను మీ ఆహారంలో రెగ్యులర్‌గా చేర్చుకుంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.





























