- Telugu News Photo Gallery Experts say that sitting and working for hours can lead to health problems Telugu news
గంటల కొద్దీ కూర్చుని పని చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలకు వెల్ కమ్ చెప్పినట్లే..
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ పని వేళలు, పని చేసే విధానంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. చేసే పని నుంచి తినే ఆహారం వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శారీరక శ్రమ తగ్గి.. విలాసవంతమైన జీవనానికి చాలా మంది అలవాటు పడుతున్నారు. దీనిలో భాగంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరుతున్నాయి. ....
Updated on: Nov 17, 2022 | 11:36 AM

ప్రస్తుతం అన్ని పనులు కంప్యూటర్ ద్వారానే జరుగుతుండటంతో స్క్రీన్ ముందు కూర్చుని పని చేసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలా గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల అనారోగ్యం వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని చిట్కాలు, పద్ధతులను పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

వ్యాయామాలు, యోగా అనేవి ముందు వరసలో ఉంటాయి. శరీరానికి సరైన వ్యాయామం ఇవ్వకపోవడం, ఇలాంటి పరిస్థితులు దీర్ఘకాలం ఉన్నట్లయితే వెన్ను సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే ఎప్పుడూ నిటారుగా కూర్చోవాలని, ఈ సమస్యలను అరికట్టడానికి సాధారణ వ్యాయామాలు చేయాలని సూచిస్తుంటారు.

వెన్ను నొప్పి ఉన్న వారు రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి. ఎన్ని పనులున్నా ఎక్సర్‌సైజ్ చేయడానికి టైమ్ కేటాయించాలి. రెండు చేతుల వేళ్లతో కాళ్ల వేళ్లను పట్టుకోవాలి. ఇలా చేసేటపపుడు మీ కాళ్లు నిఠారుగా ఉండాలి. తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవారు డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. నొప్పి ఉన్న ప్రాంతం వద్ద మాసాజ్ చేయాలి. దీంతో ఉపశమనం కలిగి రిలాక్స్ గా అనిపిస్తుంది.

ఆవాల నూనెతో చేసే మసాజ్ మంచి ప్రయోజనాలను ఇస్తుంది. స్నానం చేసేప్పుడు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసుకుంటే వెన్నునొప్పి తగ్గడమే కాకుండా నరాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. సాధారణంగా అధిక బరువు ఉన్నవారిలో నడుము నొప్పి సమస్య వస్తుంది. కంటినిండా సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ప్రశాంతంగా నిద్రపోతే చాలా ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.

రోజుకు కనీసం 7-8 గంటలైనా నిద్రపోవాలి. ఒత్తిడి ఎక్కువైనా వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. టెన్షన్ పడితే మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది ఆ ప్రభావం శరీరం మొత్తం మీద పడుతుంది. 0 ఆహారంలో చక్కెర తగ్గించండి. ఆకుకూరలు, కూరగాయలతోపాటూ అవిసె గింజలు, సబ్జా గింజలు ఎక్కువగా తీసుకోవాలి.





























