నేరస్థులు లేదా నిందితుల నుంచి వాస్తవాలను రాబట్టడానికి పోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, సైకాలజిస్టుల పర్యవేక్షణలో నార్కో-అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్ ముందు సబ్జెక్ట్‌ను పడుకోబెట్టి, కంప్యూటర్ స్క్రీన్‌పై విజువల్స్ చూపిస్తారు. మెడికల్‌గా ఫిట్‌గా ఉన్న వ్యక్తికి మాత్రమే హిప్నోటిక్ సోడియం పెంటోథాల్ ఇంజెక్ట్ చేస్తారు. దీనిని థియోపెంటోన్ అని కూడా పిలుస్తారు. దీనిని ట్రూత్ సీరం అని కూడా అంటారు. ఈ ఇంజక్షన్ ఇవ్వగానే వ్యక్తి తన మనసుపై నియంత్రణ (సెల్ఫ్ కాన్షియస్‌నెస్) కోల్పోతాడు. సెల్ఫ్ కాన్షియస్‌నెస్ తక్కువగా ఉన్నప్పుడు హిప్నోటిక్ స్థితిలోకి ప్రవేశిస్తాడు. ఎగ్జామినర్లు సబ్జెక్ట్‌ను ప్రశ్నించి, వాస్తవాలను రాబట్టడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.