నన్ను చూసి నేనే భయపడ్డా.. ఊపిరి ఆడేది కాదు.. దాన్ని నుంచి బయటపడటానికి నాలుగేళ్లు పట్టింది..
అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

సినిమా హీరోయిన్స్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలకు తగ్గట్టుగా తమ శరీరాకృతి మార్చుకుంటూ ఉంటారు హీరోయిన్స్. అంతే కాదు గ్లామరస్ గా కనిపించేందుకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ముద్దుగుమ్మలు. ఇక చాలా మంది హీరోయిన్స్ లేటు వయసులో స్లిమ్ గా కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు. సినిమాలు ఉన్నా లేకుండా ఫిట్ నెస్ కు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా మంది భామలు. నాలుగు పదుల వయసులోనూ యోగా, ఎక్సర్సైజ్ లు చేస్తూ పాతికేళ్ల పడుచుపిల్లలా కనిపిస్తున్నారు. అంతే కాదు మరికొంతమంది భామలు భారీగా బరువు పెరిగి ఆతర్వాత స్లిమ్ గా మారి షాక్ ఇస్తున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు సన్నజాజిలా మారి అందరూ అవాక్ అయ్యేలా చేసింది. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..
తాజాగా హీరోయిన్ ఖుష్బూ గతంలో బరువు పెరగడం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నా అని తెలిపింది ఖుష్బూ..ఆ సమయంలో అద్దంలో ఒకసారి నా ముఖాన్ని చూసుకుని నేనే భయపడ్డాను. కొంచం దూరం నడిచినా ఊపిరి ఆడేది కాదు, మోకాలి నొప్పి వచ్చేది. మళ్లీ ఈ స్థాయికి రావడానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది అని తెలిపారు కుష్బూ.. ఇప్పుడు ఆమె చాలా స్లిమ్ గా యంగ్ హీరోయిన్ లుక్ లో మెరిసిపోతుంది.
కాగా ఖుష్బూ సుందర్. 1990లలో తమిళ్ సినీ ప్రపంచంలో ప్రముఖ నటిగా పేరు సంపాందించుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రభు, కమల్ హాసన్, వెంకటేష్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. 1980లో ది బర్నింగ్ ట్రైన్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నసీబ్, లావారీస్, కాలియా, దర్ద్ కా రిష్తా చిత్రాల్లో బాలనటిగా నటించింది. ఆ తర్వాత జాకీ ష్రాఫ్ సరసన జానూ చిత్రంతో ఆమె కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తాన్ బదన్, దీవానా ముజ్ సా నహిన్ చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత సౌత్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




