AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్యరంగంలో కొత్త విప్లవం! భారతదేశ తొలి MRI యంత్రం.. ఎలా తయారు చేశారో తెలుసా!

భారత్‌లో వైద్య రంగానికి సంబంధించి కీలకమైన మార్పు చోటుచేసుకుంటోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి భారీ ఖర్చుతో దిగుమతి చేసుకున్న మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) యంత్రాలు ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయి. బెంగళూరుకు చెందిన వోక్సెల్‌గ్రిడ్స్ సంస్థ తక్కువ ఖర్చుతో, తక్కువ బరువుతో MRI యంత్రాలను అభివృద్ధి చేస్తోంది. దేశంలో మరింత మంది ప్రజలకు ఆధునిక వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

వైద్యరంగంలో కొత్త విప్లవం! భారతదేశ తొలి MRI యంత్రం.. ఎలా తయారు చేశారో తెలుసా!
Arjun Arunachalam, Founder Of Voxelgrids
Balaraju Goud
|

Updated on: Aug 07, 2026 | 12:10 PM

Share

భారత్‌లో వైద్య రంగానికి సంబంధించి కీలకమైన మార్పు చోటుచేసుకుంటోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి భారీ ఖర్చుతో దిగుమతి చేసుకున్న మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) యంత్రాలు ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయి. బెంగళూరుకు చెందిన వోక్సెల్‌గ్రిడ్స్ సంస్థ తక్కువ ఖర్చుతో, తక్కువ బరువుతో MRI యంత్రాలను అభివృద్ధి చేస్తోంది. దేశంలో మరింత మంది ప్రజలకు ఆధునిక వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

దశాబ్దాలుగా అమెరికా, జర్మనీ, జపాన్, చైనా, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలే ప్రపంచ మార్కెట్‌లో MRI యంత్రాల తయారీలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. భారత్ కూడా MRI పరికరాలను భారీగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటిగా ఉంది. ప్రతి ఏడాది సుమారు రూ.3,500 కోట్ల విలువైన MRI సంబంధిత ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో బెంగళూరుకు చెందిన అర్జున్ అరుణాచలం వోక్సెల్‌గ్రిడ్స్‌ అనే సంస్థను ప్రారంభించారు. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన వైద్య పరికరాల్లో ఒకటైన MRIని దేశీయంగా అభివృద్ధి చేయడం అంత సులభం కాలేదు. భారీ ఆర్థిక వనరులు కలిగిన అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడాల్సి రావడంతో స్టార్టప్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ క్రమంలో ఓ విదేశీ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్‌ను అరుణాచలం తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఆ సంస్థలో చేరడం లేదా కంపెనీని విక్రయించడం ద్వారా తక్షణ ఆర్థిక ప్రయోజనం లభించినప్పటికీ, అలా చేస్తే స్వదేశీ ఆవిష్కరణలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందని ఆయన భావించారు. భారతదేశంలోనే సాంకేతికతను అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగారు.

ఈ ప్రయాణంలో టాటా ట్రస్ట్స్ కీలకంగా నిలిచింది. 2015లో అప్పటి టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటాతో జరిగిన సమావేశం అనంతరం సంస్థకు తొలి దశలో ఆర్థిక సహాయం లభించింది. అనంతరం 2021లో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు నుంచి కూడా గణనీయమైన మద్దతు లభించింది. ఈ పెట్టుబడులు సంస్థ పరిశోధన, అభివృద్ధి, తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేశాయి. వోక్సెల్‌గ్రిడ్స్ అభివృద్ధి చేసిన MRI యంత్రాలు సాంప్రదాయ పరికరాలతో పోలిస్తే సుమారు 40 శాతం తక్కువ ధర, 50 శాతం తక్కువ బరువు కలిగి ఉన్నాయని సంస్థ చెబుతోంది. తక్కువ బరువు కారణంగా ఆసుపత్రుల్లో యంత్రాల ఏర్పాటు, మౌలిక వసతుల ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది.

అత్యంత ముఖ్యంగా, ఈ సాంకేతికత ద్వారా MRI స్కాన్ల ఖర్చును సుమారు 70 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని అరుణాచలం తెలిపారు. ఖరీదైన వైద్య పరీక్షలు అందుబాటులో లేని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా MRI సేవలను విస్తరించేందుకు ఇది దోహదపడొచ్చు. విదేశీ దిగ్గజాల ఆధిపత్యం ఉన్న వైద్య పరికరాల రంగంలో ఒక భారతీయ సంస్థ స్వదేశీ సాంకేతికతతో ముందుకు రావడం దేశానికి కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇది కేవలం ఒక యంత్రం తయారీ మాత్రమే కాకుండా.. ఖరీదైన వైద్య సాంకేతికతను సామాన్యులకు చేరువ చేసే దిశగా భారతదేశం వేస్తున్న మరో ముఖ్యమైన అడుగుగా నిలుస్తోంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ
 బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు.. ఉపయోగపడే కొర్రలతో జావ
 బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు.. ఉపయోగపడే కొర్రలతో జావ
సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే జీవితం హాయిగా ఉంది..
సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే జీవితం హాయిగా ఉంది..