AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఫోన్ ఇచ్చే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే భారీ ఖర్చుకి రెడీ అయిపోండి

Smartphone Warning Signs.. స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. కాల్స్ నుంచి బ్యాంకింగ్ వరకు ఎన్నో పనులు ఫోన్‌తోనే చేస్తున్నాం. అయితే వాడుతున్న సమయంలో ఎదురయ్యే చిన్న సమస్యలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఫోన్ వేడెక్కడం, ఛార్జింగ్ ఆగిపోవడం, స్క్రీన్ పగలడం వంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం వెంటనే జాగ్రత్త పడాలి.

మీ ఫోన్ ఇచ్చే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే భారీ ఖర్చుకి రెడీ అయిపోండి
Smartphone Warning Signs
Nikhil
|

Updated on: Sep 16, 2026 | 9:20 PM

Share

మీ ఫోన్ ఒక్కసారిగా వేడెక్కుతోందా? ఛార్జింగ్ కేబుల్ సరిగ్గా పనిచేయడం లేదా? స్క్రీన్‌పై చిన్న పగులు వచ్చినా టచ్ మాత్రం పనిచేస్తోందని వాడుతున్నారా? ఇలాంటి సమస్యలను తేలిగ్గా తీసుకుంటే తర్వాత మరమ్మతులకు భారీ మొత్తం ఖర్చు చేయాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో భద్రతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.

వెంటనే కారణం తెలుసుకోండి..

గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఛార్జింగ్ సమయంలో కొంత వేడి రావడం సాధారణమే. కానీ ఎలాంటి పని చేయకపోయినా ఫోన్ విపరీతంగా వేడెక్కుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. బ్యాటరీ లేదా ప్రాసెసర్‌లో సమస్యకు ఇది సంకేతం కావచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న అవసరం లేని యాప్‌లను మూసివేయాలి. నాణ్యత లేని ఛార్జర్‌లను ఉపయోగించకపోవడం మంచిది. బ్యాటరీ ఒక్కసారిగా త్వరగా ఖాళీ అవుతున్నా జాగ్రత్త. ముఖ్యంగా ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వాడటం ఆపేయాలి. ఉబ్బిన బ్యాటరీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున స్వయంగా మార్చే ప్రయత్నం చేయకుండా అధీకృత సేవా కేంద్రాన్ని సంప్రదించడం మంచిది.

చిన్న సమస్య పెద్ద నష్టం..

ఛార్జింగ్ కేబుల్ కాస్త కదిలినా ఛార్జింగ్ ఆగిపోతుంటే కేబుల్ సమస్యే అనుకోవద్దు. ఛార్జింగ్ పోర్టులో ధూళి పేరుకుపోయినా ఇలాంటి సమస్య రావచ్చు. శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బలంగా వస్తువులు పెట్టడం వల్ల పోర్టు దెబ్బతినే ప్రమాదం ఉంది. స్క్రీన్‌పై చిన్న పగులు వచ్చినా అలాగే వాడటం మంచిది కాదు. ఆ పగుళ్ల ద్వారా నీరు, చెమట లోపలికి చేరి డిస్‌ప్లేతో పాటు లోపలి భాగాలను దెబ్బతీయొచ్చు.

ఫోన్ తరచూ ఆగిపోవడం, నెమ్మదించడం కూడా నిల్వ స్థలం నిండిపోవడం వల్ల కావచ్చు. అనవసరమైన ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను తొలగించి ఖాళీ స్థలాన్ని ఉంచాలి. చిన్న సమస్య కనిపించినప్పుడే స్పందిస్తే పెద్ద మరమ్మతు ఖర్చును తప్పించుకోవచ్చు. ఫోన్ ఇస్తున్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Follow Us
మీ ఫోన్ ఈ సంకేతాలు ఇస్తోందా? ఏం జరుగుతుందో తెలుసా
మీ ఫోన్ ఈ సంకేతాలు ఇస్తోందా? ఏం జరుగుతుందో తెలుసా
ఎంత పనిచేశావ్‌రా బుడ్డోడా.. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం ఏకంగా కోటి..
ఎంత పనిచేశావ్‌రా బుడ్డోడా.. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం ఏకంగా కోటి..
చెక్క పెట్టెలో రక్తపు మరకలు.. తెరిచి చూడగా షాక్!
చెక్క పెట్టెలో రక్తపు మరకలు.. తెరిచి చూడగా షాక్!
ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్‌ అకౌంట్​ ప్రమాదంలో ఉన్నట్టే
ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్‌ అకౌంట్​ ప్రమాదంలో ఉన్నట్టే
చెత్తల్లోంచి బ్యూటీ ప్రొడక్ట్స్‌..! కాస్మెటిక్స్ రంగంలో సరికొత్త
చెత్తల్లోంచి బ్యూటీ ప్రొడక్ట్స్‌..! కాస్మెటిక్స్ రంగంలో సరికొత్త
గేమర్స్‌కు మతిపోగొట్టే చిప్​తో ఐకూ16.. ఏంటది
గేమర్స్‌కు మతిపోగొట్టే చిప్​తో ఐకూ16.. ఏంటది
వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు.. పంత్‌కు మొండిచేయి..!
వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు.. పంత్‌కు మొండిచేయి..!
ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు..లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి,సంపదలు
ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు..లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి,సంపదలు
పరివర్తినీ ఏకాదశి ఎప్పుడు? వ్రతం, శుభ సమయాలు తెలుసా..?
పరివర్తినీ ఏకాదశి ఎప్పుడు? వ్రతం, శుభ సమయాలు తెలుసా..?
ఐపీఎల్ వేలాన్ని రద్దు చేయాలి.. క్రికెటర్ల మైండ్ తో గేమ్స్ వద్దు
ఐపీఎల్ వేలాన్ని రద్దు చేయాలి.. క్రికెటర్ల మైండ్ తో గేమ్స్ వద్దు