September 8, 2026
Subhash
రోడ్డుపై అంబులెన్స్ కనిపించగానే మన దృష్టి వెంటనే దానిపై పడుతుంది. అంబులెన్స్‌లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక అసలు కారణాలున్నాయి.
తెలుపు రంగు సూర్యకిరణాలను ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ముదురు రంగులతో పోలిస్తే వాహనం బయట భాగం తక్కువగా వేడెక్కుతుంది. ఎక్కువసేపు ఎండలో ఉన్నా సమస్యలేమి ఉండదు.
తెలుపు రంగుపై దుమ్ము, మరకలు, మురికి స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో అంబులెన్స్‌ను ఎప్పుడు శుభ్రం చేయాలో సిబ్బందికి సులభంగా తెలుస్తుంది
తెలుపు రంగు సాధారణంగా పరిశుభ్రత, స్వచ్ఛత, వైద్య సేవలతో అనుసంధానిస్తరు. అందుకే అంబులెన్స్‌ను చూడగానే అది వైద్య అత్యవసర వాహనం అనే భావన ప్రజలకు కలుగుతుంది.
తెలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై మెడికల్ సింబల్స్, నంబర్లు, ఎమర్జెన్సీ మార్కింగ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్‌ను కూడా తెలుపు రంగుపై సులభంగా గుర్తించవచ్చు.
చీకటిలో రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్, ఇతర హెచ్చరిక గుర్తులు కాంతిని ప్రతిబింబిస్తాయి. ఇతర వాహనదారులు త్వరగా గుర్తించే అవకాశం పెరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యం.
తెలుపు రంగు అంబులెన్స్‌లు ప్రజలకు చాలా కాలంగా సుపరిచితం. సైరన్‌తో పాటు అంబులెన్స్ కనిపించగానే అది అత్యవసర వాహనం అని డ్రైవర్లు గుర్తించి దారి ఇచ్చే అవకాశం ఉంటుంది.
అంబులెన్స్‌లకు తెలుపు రంగు సాధారణమైనదే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇదే రంగు తప్పనిసరి కాదు. కొన్ని దేశాలు ఎక్కువ విజిబిలిటీ కోసం పసుపు, ఆకుపచ్చ రంగులను ఉపయోగిస్తాయి.