The Paradise: నో ట్రైలర్.. వాళ్లను ఫాలో అవుతున్న ప్యారడైజ్
సినిమా విడుదలకు ముందు ట్రైలర్ కీలకమైన ప్రమోషనల్ సాధనంగా మారిన నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’ మాత్రం ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి రావాలని చూస్తోంది. కథ, ట్విస్టులు ముందే బయటపడకుండా ప్రేక్షకులకు నేరుగా థియేట్రికల్ అనుభూతి ఇవ్వాలనుకుంటున్నట్లు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పినట్లు కథనం పేర్కొంది. గతంలో ‘మహానటి’, ‘గీతా గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాలు ట్రైలర్ లేకుండానే విజయాలు సాధించాయి.
ఈరోజుల్లో సినిమాలకు ట్రైలర్ ప్రాణం.. అది బాగుంటే సగం సినిమా హిట్టైపోయినట్లే. కానీ ట్రైలర్ లేకుండా సినిమాను రిలీజ్ చేయడమంటే చాలా రిస్క్ అనే చెప్పాలి. ప్యారడైజ్ ఈ రిస్క్ తీసుకుంటుందిప్పుడు. కానీ దీని వెనక ఓ బ్లాక్‌బస్టర్ సెంటమెంట్ ఉంది. గత పదేళ్లలో మూడు సినిమాలు వితౌట్ ట్రైలర్ వచ్చి రచ్చ చేసాయి. మరి అవేంటి..? ప్యారడైజ్‌కు అదే సెంటిమెంట్ కలిసొస్తుందా..? ట్రైలర్ లేకుండానే ప్యారడైజ్ వస్తుందన్నారు నాని. అదేంటని అడిగితే టైమ్ లేదన్నారు. కానీ ట్రైలర్ వస్తే కథతో పాటు ట్విస్టులు లీకయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేరుగా ఆడియన్స్‌కు థియెట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాని చూస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. అయితే ట్రైలర్ లేకుండా సినిమా విడుదలవడం ఓ రకంగా మంచిదే. మహానటి లాంటి సెన్సేషనల్ సినిమా ట్రైలర్ లేకుండానే విడుదలైంది. మహానటికి ఎలాంటి ట్రైలర్ లేకుండానే విడుదల చేసారు నాగ్ అశ్విన్. అది సంచలన విజయం సాధించింది.. అలాగే విజయ్ దేవరకొండ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ గీతా గోవిందం కూడా ట్రైలర్ లేకుండానే వచ్చింది. 2018లో ఈ రెండు సినిమాలు వచ్చాయి. శ్రీవిష్ణు నటించిన బ్రోచేవారెవరురా కూడా ట్రైలర్ లేకుండానే విడుదలై విజయం సాధించింది. మహేష్ బాబు కల్డ్ క్లాసిక్ ఖలేజాకు కూడా ట్రైలర్ లేదు.. అలాగే రవితేజ డిస్కో రాజాకు ఎలాంటి ట్రైలర్ కట్ చేయలేదు. రజినీకాంత్ సెన్సేషనల్ సినిమా కబాలి కేవలం టీజర్స్‌తోనే విడుదలైంది.. అలాగే విజయ్ సర్కార్‌కు ఏ ట్రైలర్ కట్ చేయలేదు. వీటిలో ఖలేజా, డిస్కో రాజా తప్ప అన్ని సినిమాలు ట్రైలర్స్ లేకుండానే వచ్చి విజయం సాధించాయి. ప్యారడైజ్‌కు ఇదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమో చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
UPI ఛార్జీలపై కేంద్రం క్లారిటీ.. అప్పటి నుంచే అమలు
Top9 ET news: హమ్మయ్య.. ఇప్పటికి రూట్ క్లియర్…| రాజమౌళి నుంచి ఊహించని అప్‌డేట్
Suriya: ఇదే సరైన టైమ్.. మొదలైన సూర్య గేమ్..!
Allu Arjun: అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్.. ఒకేసారి రెండు సినిమాలు
షూటింగ్ అప్‌డేట్స్..ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలుసా..?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

