AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwambhara: విశ్వంభరకు లైన్ క్లియర్.. కుదిరిన ఓటిటి డీల్

Vishwambhara: విశ్వంభరకు లైన్ క్లియర్.. కుదిరిన ఓటిటి డీల్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 16, 2026 | 1:38 PM

Share

చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విశ్వంభర’ రిలీజ్‌పై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. షూటింగ్‌ పూర్తై చాలాకాలం అవుతున్నా విడుదలకు నోచుకోని ఈ సినిమాకు ఓటీటీ డీల్‌ అడ్డంకిగా ఉందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు సోనీ లివ్‌తో డిజిటల్‌ రైట్స్‌ డీల్‌ తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సంక్రాంతికి ‘విశ్వంభర’ను తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్‌. అదే జరిగితే చిరంజీవి ‘కాకా’ విడుదల సమ్మర్‌కు మారే అవకాశం ఉందని సమాచారం.

విశ్వంభర కథ క్లైమాక్స్‌కు వచ్చిందా..? రిలీజ్‌కు లైన్ క్లియర్ అయిపోయిందా..? ఇన్నాళ్లూ ఓటిటి డీల్ కోసం ఎదురు చూస్తున్న దర్శక నిర్మాతలకు ఓ బడా సంస్థ గుడ్ న్యూస్ చెప్పిందా..? చిరంజీవి సినిమాను కొన్నదెవరు..? ఆ డీల్ పూర్తైపోతే విశ్వంభర విడుదలను ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు..? అసలు విజువల్ ఎఫెక్ట్స్ ఎంతవరకు వచ్చాయి..? చిరంజీవి ప్రస్తుతం తన ఫోకస్ అంతా కాకా సినిమాపైనే పెట్టినా.. ఉన్నట్లుండి ట్రెండింగ్‌లోకి వచ్చింది విశ్వంభర. వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తై రెండేళ్లు దాటినా ఇంకా రిలీజ్ కాలేదు. కారణాలు అనవసరం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది.. ఇదే విషయాన్ని మనం ఈటీలో ముందే మాట్లాడుకున్నాం కూడా. VFX కూడా ఇప్పటికే పూర్తైపోయింది.. చిరంజీవి కూడా ఔట్ చూసి హ్యాపీగానే ఉన్నారు. అంతా బాగానే ఉన్నా.. ఓటిటి డీల్ పూర్తి కాలేదనే ఒకే ఒక్క కారణంగా విశ్వంభర ఇన్నాళ్లూ రిలీజ్‌కు నోచుకోలేదు. ఇప్పుడు అది కూడా పూర్తైనట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటిటి సంస్థ సోని లివ్ చిరు సినిమా డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటిటి డీల్ ఫైనల్ స్టేజీలో ఉండటంతో.. సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే కాకా సినిమా సమ్మర్‌కు వాయిదా పడనుంది. ఈ మేరకు ఇప్పటికే విశ్వంభర మేకర్స్ చిరు నుంచి పర్మిషన్స్ కూడా తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి పండక్కి కాకా ప్లేస్‌లో విశ్వంభర వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.. అలా జరక్కపోతే షెడ్యూల్ ప్రకారం కాకా వచ్చేస్తాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

UPI ఛార్జీలపై కేంద్రం క్లారిటీ.. అప్పటి నుంచే అమలు

Top9 ET news: హమ్మయ్య.. ఇప్పటికి రూట్ క్లియర్…| రాజమౌళి నుంచి ఊహించని అప్‌డేట్

Suriya: ఇదే సరైన టైమ్.. మొదలైన సూర్య గేమ్..!

Allu Arjun: అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్.. ఒకేసారి రెండు సినిమాలు

షూటింగ్ అప్‌డేట్స్..ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలుసా..?

Follow Us