మార్కాపురం జిల్లాలోని పుల్లలచెరువు మండలంలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక ఎకరాల్లో అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు కోల్పోయి, ప్రకృతి ప్రకోపంతో మరింత నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి, నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్నారు.