AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరె.. డిజైన్ అనుకుని పప్పులో కాలు వేశామా.. ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో రంధ్రం వెనక పెద్ద కథే..

మనందరం రోజూ వాడే ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో ఓ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం డిజైన్ మాత్రమే కాదు.. దాని వెనుక సైన్స్‌తో ముడిపడిన బోలెడు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. ఆ చిన్న హోల్ లేకపోతే స్టూల్స్‌ను విడదీయడం అసాధ్యం కావడమే కాదు కూర్చున్నప్పుడు అవి సులభంగా పగిలిపోతాయి కూడా. అసలు ఆ రంధ్రం వెనుకున్న సీక్రెట్స్ తెలుసుకుందాం..

అరెరె.. డిజైన్ అనుకుని పప్పులో కాలు వేశామా.. ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో రంధ్రం వెనక పెద్ద కథే..
Why Plastic Stools Have A Hole
Krishna S
|

Updated on: Sep 17, 2026 | 6:54 PM

Share

ఇళ్లలో, రెస్టారెంట్లలో, చిరువ్యాపారుల వద్ద మనం రోజూ చూసే ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో ఒక చిన్న గుండ్రని రంధ్రం ఉండటం సర్వసాధారణం. చాలామంది ఇది కేవలం అందం కోసమో లేదా డిజైన్ కోసమో ఇచ్చిన రంధ్రమని భావిస్తుంటారు. అయితే, ఈ చిన్న మార్పు వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు, ఇంజనీరింగ్ సూత్రాలు దాగి ఉన్నాయి. స్థలాన్ని ఆదా చేసేందుకు స్టూల్స్‌ను సాధారణంగా ఒకదానిపై ఒకటి పేర్చుతుంటారు. ఒకవేళ మధ్యలో రంధ్రం లేకపోతే రెండు స్టూల్స్ మధ్య ఉన్న గాలి బయటకు పోయి అక్కడ శూన్యం ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణ పీడనం ప్రభావంతో అవి ఒకదానికొకటి గట్టిగా అతుక్కుపోయి, వాటిని వేరు చేయడం చాలా కష్టమవుతుంది. మధ్యలో రంధ్రం ఉండటం వల్ల గాలి రాకపోకలు సులభమై, పేర్చిన స్టూల్స్‌ను సులువుగా విడదీయవచ్చు.

బరువు సమాన పంపిణీ – పగుళ్ల నివారణ

ఒక వ్యక్తి స్టూల్‌పై కూర్చున్నప్పుడు వారి శరీర బరువు మొత్తం మధ్యభాగంలోనే కేంద్రీకృతమై అధిక ఒత్తిడి పడుతుంది. రంధ్రం లేని ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఆ ఒత్తిడికి ప్లాస్టిక్ అకస్మాత్తుగా పగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ గుండ్రని రంధ్రం వల్ల బరువు మొత్తం స్టూల్ నాలుగు కాళ్లపై సమానంగా పంపిణీ అవుతుంది.

వృత్తాకారమే ఎందుకు?

చదరపు లేదా కోణాల ఆకారంలో రంధ్రాలు పెడితే ఆ మూలల్లో ఒత్తిడి పెరిగి పగుళ్లు వచ్చే ముప్పు ఉంటుంది. అదే గుండ్రని ఆకారం అయితే ఒత్తిడి అంతటా సమానంగా వ్యాపించి స్టూల్‌కు గరిష్ట బలాన్ని, మన్నికను ఇస్తుంది. అంతేకాకుండా ఈ రంధ్రం ఒక చిన్న హ్యాండిల్‌లా పనిచేస్తుంది. స్టూల్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా లేదా ఒక వేలితో సులభంగా పైకి లేపాలన్నా ఈ రంధ్రం చక్కగా ఉపయోగపడుతుంది.

నీరు నిల్వ ఉండకుండా సులువుగా డ్రైనేజ్

బాత్రూంలలో స్నానం చేసేటప్పుడు లేదా ఆరుబయట వాడేటప్పుడు స్టూల్ పైభాగంలో నీరు నిలిచిపోకుండా ఈ రంధ్రం ద్వారా వెంటనే కిందకు వెళ్లిపోతుంది. దీనివల్ల స్టూల్ త్వరగా ఆరిపోయి శుభ్రంగా, పాచి పట్టకుండా ఉంటుంది.

తక్కువ తయారీ ఖర్చు – సమాన ప్లాస్టిక్ పంపిణీ

ప్లాస్టిక్ అచ్చులలో ద్రవరూప ప్లాస్టిక్‌ను నింపేటప్పుడు ఈ రంధ్ర నిర్మాణం మెటీరియల్ సమానంగా వ్యాపించడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా మధ్యలో కొంత ప్లాస్టిక్ ఆదా అవ్వడం వల్ల తయారీ ఖర్చులు తగ్గడంతో పాటు స్టూల్ తేలికగా తయారవుతుంది. పైకి సాధారణంగా కనిపించే ఈ చిన్న గుండ్రని రంధ్రం.. స్టూల్ బలాన్ని పెంచడంలోనూ, ఎక్కువ కాలం మన్నేలా చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..