AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: టాస్ ఓడిన భారత్.. వైభవ్‌కు మరోసారి హ్యాండిచ్చిన గంభీర్..!

IND vs AFG 3rd T20I Toss Update: ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత జట్టు నేడు మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌తో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు ఆప్ఘానిస్తాన్ టీం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.

IND vs AFG: టాస్ ఓడిన భారత్.. వైభవ్‌కు మరోసారి హ్యాండిచ్చిన గంభీర్..!
Afghanistan Vs India, 3rd T20i
Venkata Chari
|

Updated on: Sep 17, 2026 | 7:28 PM

Share

IND vs AFG Toss Update: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సిరీస్‌లోని మూడవ, చివరి టీ20ఐ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆఫ్ఘానిస్తాన్ బౌలింగ్ చేయనుంది. రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి భారత్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

10 మ్యాచ్‌లు గెలిచిన భారత్..

ఈ రెండు జట్లు ఇప్పటివరకు 11 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో భారత్ 10 గెలవగా, ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.

ఢిల్లీలో బ్యాట్స్‌మెన్‌లకు హెల్ప్..

అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. చిన్న బౌండరీలు భారీ షాట్లను ప్రోత్సహించే అవకాశం ఉంది. గురువారం వర్షం పడే అవకాశం లేదు.

ఇరు జట్లు:

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహమానుల్లా గుర్బాజ్ (కీపర్), సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, నూర్ ఉల్ రహ్మాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ అబ్దుల్లా అబ్దుల్లా అబ్దుఖీ.

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా.

Follow Us