Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్
పుట్టెడు దుఃఖంలో రోడ్డుపై పాడే మొసుకెళ్తుండగా.. వెనకే వచ్చిన ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టాడు. అంతే. మృతుడి బంధువులకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది మృతుడి బంధువులు పాడే కాసేపు పక్కకు పెట్టి... ఆర్టీసీ డ్రైవర్ పని పట్టారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసి చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటట్టింట వైరల్‌గా మారింది..

ధర్మవరం, మార్చి 13: చనిపోయిన వ్యక్తి పాడిన మూసుకుంటూ స్మశానానికి వెళుతుంటే.. వెనకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. రెండు మూడుసార్లు అలాగే ఆర్టీసీ డ్రైవర్ హారను కొట్టడంతో మృతుడి బంధువులకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది మృతుడి బంధువులు పాడే కాసేపు పక్కకు పెట్టి… ఆర్టీసీ డ్రైవర్ పని పట్టారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసి చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటట్టింట వైరల్‌గా మారింది.
ధర్మవరం నుంచి అనంతపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కాజావుద్దీన్ ను కొందరు వ్యక్తులు చితకబాదారు. ధర్మవరం మార్కెట్ యార్డ్ వద్ద శవాన్ని తీసుకెళ్తుండగా ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టాడని మృతుడి బంధువులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డుపై బస్సు ఆపుచేసి డ్రైవర్ కాజావుద్దీన్ ను కిందకి దించి గొడవపడ్డారు. ఇంతలో మాట మాట పెరిగింది. ఇంకేముంది మృతుడు తాలూకా బంధువులు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశారు. అడ్డొచ్చిన కండక్టర్ పై కూడా దురుసుగా ప్రవర్తించారు. బస్సులో ప్రయాణికులు ఎంత వారించినా వినకుండా ఆర్టీసీ డ్రైవర్ పై చనిపోయిన వ్యక్తి తాలూకు బంధువులు దాడికి పాల్పడ్డారు.
శవాన్ని తీసుకెళ్తుండగా అదేపనిగా ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దాడిలో గాయపడ్డ ఆర్టీసీ డ్రైవర్ను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రయాణికులు. హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయడం ఎంత కరెక్ట్ కాదో.. స్మశానానికి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆర్టీసీ డ్రైవర్ కూడా కాస్త ఓపికగా ఒక ఐదు నిమిషాలు వేచి ఉండాల్సిందని బస్సులో ప్రయాణికులు అంటున్నారు. మొత్తానికి హారన్ కొట్టాడని.. శవాన్ని పక్కన పెట్టి మరీ వచ్చి ఆర్టీసీ డ్రైవర్ పని పట్టడం స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




