AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్లు ఉన్నాయంటూ కటింగ్.. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి పిలిచిన మహిళ.. కట్ చేస్తే..

హైదరాబాద్‌లోని మూసాపేట, అల్లాపూర్ ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రెండ్ యాప్‌లో పరిచయమై, కోట్లు ఉన్న సంపన్నుడినంటూ నమ్మించిన కారు మెకానిక్ ఓ గృహిణి నుంచి 20 గ్రాముల బంగారు మంగళసూత్రం కాజేశాడు. వీడియో కాల్స్‌లో ఖరీదైన కార్లు, నోట్ల కట్టలు చూపిస్తూ ఆమెను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కోట్లు ఉన్నాయంటూ కటింగ్.. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి పిలిచిన మహిళ.. కట్ చేస్తే..
Car Mechanic Cheats Woman
Shaik Madar Saheb
|

Updated on: Nov 24, 2026 | 9:02 AM

Share

మూసాపేట / అల్లాపూర్: అతనో మెకానిక్.. డబ్బులున్న మహిళలను టార్గెట్ చేస్తాడు.. యాప్‌లో పరిచయమై.. కోట్లు ఉన్నాయంటూ బిల్డప్ కొడతాడు.. చివరకు, ఏది దొరికితే అది ఎత్తుకు వెళతాడు.. ఈ షాకింగ్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సోషల్ యాప్‌ల ద్వారా పరిచయమై, తాను భారీ సంపన్నుడినని నమ్మిస్తూ మహిళల నుంచి బంగారు ఆభరణాలు కాజేస్తున్న యువకుడిని అల్లాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా కుక్కునూర్ మండలం ఇబ్రహీంపేటకు చెందిన పేట వసంత్ (25) కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ‘ఫ్రెండ్ యాప్’ ద్వారా ఆర్థికంగా స్థితిమంతులైన మహిళలను లక్ష్యంగా చేసుకుని, స్నేహం ముసుగులో మోసాలకు పాల్పడటాన్ని అలవాటుగా మార్చుకున్నాడు.

వీడియో కాల్స్‌తో మాయాజాలం.. ఇంటికి ఆహ్వానం:

అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వత్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు (35)కి ఫ్రెండ్ యాప్‌లో వసంత్ పరిచయమయ్యాడు. మాటలతో ఆమెను దగ్గర చేసుకున్న నిందితుడు, వీడియో కాల్స్ చేస్తున్న సమయంలో తన మెకానిక్ షెడ్డుకు వచ్చిన ఖరీదైన కార్లను చూపిస్తూ అవి తన సొంత కార్లని నమ్మించాడు. అంతేకాకుండా సూటుబూటు వేసుకుని, టేబుల్‌పై నోట్ల కట్టలు పేర్చి వీడియో కాల్‌లో ప్రదర్శించేవాడు. వసంత్ మాటలు, ఆడంబర ప్రదర్శనను నిజమేనని నమ్మిన బాధితురాలు ఇటీవల తన ఇంటికి రావాల్సిందిగా అతడిని ఆహ్వానించింది.

ఖరీదైన కారులో వచ్చిన వసంత్, ఆ గృహిణిని పలు ప్రాంతాలకు కారులో తిప్పాడు. అనంతరం మాయమాటలు చెప్పి, ఆమె మెడలోని 20 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని ఇస్తే మరుసటి రోజు తిరిగి ఇస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మి ఆమె మంగళసూత్రం ఇవ్వగా, నిందితుడు అక్కడి నుంచి జారుకున్నాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

సాంకేతిక ఆధారాలతో..

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అల్లాపూర్ పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు వసంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 20 గ్రాముల మంగళసూత్రం, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నవీన్‌కుమార్ తెలిపారు.

Follow Us
బిల్డప్ చూసి.. ఎవరూ లేనప్పుడు ఇంటికి పిలిచిన మహిళ.. కట్ చేస్తే..
బిల్డప్ చూసి.. ఎవరూ లేనప్పుడు ఇంటికి పిలిచిన మహిళ.. కట్ చేస్తే..
బంధువులను సాగనంపేందుకు వందేభారత్ ఎక్కిన 12 మంది.. ఆ తర్వాత సీన్‌
బంధువులను సాగనంపేందుకు వందేభారత్ ఎక్కిన 12 మంది.. ఆ తర్వాత సీన్‌
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి రైల్వేశాఖ సూపర్ న్యూస్
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి రైల్వేశాఖ సూపర్ న్యూస్
పెద్ది సినిమాపై శ్రుతిహాసన్ సంచలన వ్యాఖ్యలు..
పెద్ది సినిమాపై శ్రుతిహాసన్ సంచలన వ్యాఖ్యలు..
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
ఇంటర్ విలీనంతో కీలకమార్పులు.. 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉంటాయా?
ఇంటర్ విలీనంతో కీలకమార్పులు.. 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉంటాయా?
తిలక్ కాదు.. టీమిండియా ఓటమికి ఈ ముగ్గురు అసలైన విలన్లు..!
తిలక్ కాదు.. టీమిండియా ఓటమికి ఈ ముగ్గురు అసలైన విలన్లు..!
అర్ధరాత్రి చీకట్లో వింత ఆకారం.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
అర్ధరాత్రి చీకట్లో వింత ఆకారం.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
విద్యార్ధులకు అలర్ట్.. ఇవాళ దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు సెలవ్!
విద్యార్ధులకు అలర్ట్.. ఇవాళ దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు సెలవ్!
మెత్తగా ఉండే జొన్న దిబ్బరొట్టె.. షుగర్ పేషంట్స్ కూడా 2 ఎక్కువే
మెత్తగా ఉండే జొన్న దిబ్బరొట్టె.. షుగర్ పేషంట్స్ కూడా 2 ఎక్కువే