AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: ఇస్రో చరిత్రలోనే ఒక మైలురాయి.. తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం: కేంద్రమంత్రి జితేంత్ర సింగ్

ఇస్రోకు ఈ శుక్రవారం (18 నవంబర్) ఎంతో ప్రత్యేకం కానుంది. తన స్పేస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించి చరిత్ర సృష్టించనుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.

ISRO: ఇస్రో చరిత్రలోనే ఒక మైలురాయి.. తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం: కేంద్రమంత్రి జితేంత్ర సింగ్
Jitendra Singh
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2022 | 8:54 AM

Share

ISRO private rocket: ఇస్రోకు ఈ శుక్రవారం (18 నవంబర్) ఎంతో ప్రత్యేకం కానుంది. తన స్పేస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించి చరిత్ర సృష్టించనుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఈ విషయంపై కేంద్ర సాంకేతిక శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. విక్రమ్ సబర్బిటల్ అనే రాకెట్ తొలి ప్రైవేట్ ప్రయోగాన్ని వీక్షించేందకు మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) శ్రీహరి కోటకు రానున్నారు. అంతరిక్షంలో ప్రయివేట్ భాగస్వామ్యం- ఈ అంశంపై రెండేళ్ల క్రితమే ప్రధాని మోదీ.. ద్వారాలు తెరిచారు. ఈ నిర్ణయ ఫలితంగానే.. ప్రైవేటు రాకేట్ నింగిలోకి వెళ్లనుందనీ.. ఇస్రో ప్రయాణంలో ఇదో మైలురాయిగా అభివర్ణించారు కేంద్ర మంత్రి. ప్రభుత్వేతర స్టార్టప్ సంస్థ.. స్కైరూట్ ఏరో స్పేస్ ఈ వీకేఎస్ రాకెట్ ను డెవలప్ చేసింది. ఇది సింగిల్ స్టేజ్ స్పిన్ స్టెబిలైజ్డ్ సాలిడ్ ప్రొఫెల్లెంట్ రాకెట్. దీని బరువు 550 కిలోలు. 101 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తుందన్నారు. ఈ ప్రయోగ వ్యవధి 300 సెకన్లు మాత్రమేనని అన్నారు. రాకెట్ల ప్రయోగానికి సంబంధించి ఇస్రోతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తొలి స్పేస్ స్టార్టప్ స్కైరూట్. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్ ప్రయోగం మాత్రమే కాదు.. స్కైరూట్ కి సంబంధించి.. ఫస్ట్ మిషన్. అందుకే దీనికి ప్రారంభ్ అన్న పేరు పెట్టారని తెలిపారు.

కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మాట్టాడుతూ.. ప్రైవేట్ రాకెట్ మొత్తం మూడు పేలోడ్లను తీస్కెళ్తుందనీ.. ఇది కానీ అన్ని సమస్యలను దాటుకుని సక్సెస్ అయితే.. తక్కువ ఖర్చుతో ఉపగ్రహ సేవలకు కేరాఫ్ గా నిలుస్తుందనీ.. ఇదొక గొప్ప ప్రయోగంగా మిగిలిపోతుందనీ అన్నారు. అంతరిక్ష పరంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా స్పేస్ స్టార్టప్ ల శకం అంటూ ఒకటి మొదలైంది. ప్రస్తుతం 102 స్టార్టప్ లు అంతరిక్ష శిథిలాల నిర్వహణ, నానో శాటిలైట్, లాంచ్ వెహికల్, గ్రౌండ్ సిస్టమ్స్ వంటి అధునాతన రంగాల్లో పనులు ప్రారంభమవుతాయని.. మరింతగా పరిశోధనలు మొదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి.

ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోడానికి గల కారణం.. భారత స్పేస్ సైన్స్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకురావాలనుకోవడమే. అందుకే ఈ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచమంతా నానో శాటిలైట్ టెక్నాలజీ కోసం భారత్ వైపు చూస్తోందనీ. దీంతో పాటు ఉపగ్రహ సామర్ధ్యం నిర్మాణం వంటి అంశాల్లో వర్ధమాన దేశాలకు.. భారత్ తన సహాయ సహకారాలను అందించడం గర్వకారణంగా ఉందని మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..