Ram Charan: షాకింగ్.! రామ్ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
ఓ పక్క గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్..ఇంకో పక్క తన అప్ కమింగ్ సినిమా షూటింగ్.. వెరసి చాలా బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఓ అభిమాని నుంచి బెదిరింపు లెటర్ రావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
ఇక అసలు విషయంలోకి వెళితే..! గేమ్ ఛేంజర్ సినిమాను జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్నా.. మేకర్ నుంచి వైరల్ అయ్యే.. అప్డేట్స్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అలా సీరియస్ అయిన ఓ ఫ్యాన్.. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌ను బెదిరించాడు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను వెంటనే విడుదల చేయాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
అంతేకాదు బ్రతికుంటే అందరితో చూస్తా.. ఛస్తే ఆత్మలా చూస్తా… ఇదంతా నీ చేతుల్లోనే ఉంది చరణ్ అన్న.. అంటూ తన బాధకు అక్షర రూపమిచ్చాడు. ఈ లెటర్‌కు రిప్ లెటర్ అని పేరు కూడా పెట్టాడు. అయితే చెర్రీ ఫ్యాన్ రాసిన ఈ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తేనే.. ఆ అభిమాని తీరును అందరూ తప్పుబట్టేలా చేస్తోంది. దాంతో పాటే రామ్ చరణ్ అభిమానుల కోసమైనా గేమ్ ఛేంజర్ ట్రైలర్ త్వరగా రిలీజ్ చేయాలనే డిమాండ్ నెట్టింట ఊపందుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.