Balakrishna-NTR: బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తారక్.. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో అద్భుతమైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇటీవలే దేవర సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అయితే తారక్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ సింహాద్రి. ఎన్టీఆర్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో ఇది ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సంచలన విజయంగా సాధించిందమి. అయితే ఈ సినిమా చేయాల్సింది ఎన్టీఆర్ కాదట. ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్యనట. ఎస్ ! సింహాద్రి సినిమాను నిజానికి నందమూరి బాలకృష్ణ చేయాల్సిందంట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ కథను బాలకృష్ణ కోసం రాశారట. ఈ చిత్రానికి బీ. గోపాల్ దర్శకత్వం వహించాల్సిందట. కానీ అప్పటికే ఆయన మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ కథను రాజమౌళికి ఇచ్చి.. ఎన్టీఆర్ కు వినిపించమని చెప్పారట.
ఇక సింహాద్రి సినిమా సమయానికి ఎన్టీఆర్ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. అప్పట్లో ఈ మాస్ యాక్షన్ సినిమాను ఎన్టీఆర్ హ్యాండిల్ చేయగలడా అనే సందేహం కూడా వచ్చిందట. కానీ అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేసిన అనుభవంతో తారక్ చేయగలడని చెప్పడంతో ఈ కథను తారక్ కు వినిపించారట. అలా ఈ సినిమా ఎన్టీఆర్ తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత రిలీజ్ అయి ఎన్టీఆర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టింది. అయితే ఈ న్యూస్ మరో సారి బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. బాబాయ్ సింహాద్రి సినిమా చేసుంటే అబ్బాయి స్టార్ కెరీర్‌కు కాస్త కష్టమయ్యేదనే కామెంట్ కూడా వస్తోంది నెట్టింట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.