Venkatesh: ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ నడుస్తుంది. అందులో ఏడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సురేష్ బాబు కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇక చాలా కాలం తర్వాత వెంకీమామ, బాలకృష్ణ ఇద్దరూ ఒకే స్టేజ్ పై కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ షోలో వెంకటేశ్ పంచుకున్న ఇంట్రెస్టింగ్ సంగతులన్నీ నెట్టింటవైరల్ అవుతున్నాయి. ఇక అందులో తాను హీరో కాకుంటే.. ఏమయ్యే వాడినో అంటూ వెంకీ రివీల్ చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. దివంగత ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు విక్టరీ వెంకటేశ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అయితే వెంకటేశ్ ఫారెన్ లో చదువుకొని వచ్చి హీరోగా మారాడు. ఇక ఇదే విషయాన్ని బాలకృష్ణ ప్రస్తావిస్తూ.. అసలు నువ్వు హీరో అవ్వకపోతే ఏం అయ్యేవాడివి.. నువ్వేం చేయాలనుకున్నావు అని వెంకీని అడగ్గా.. వెంకటేష్ తనకు ఫారెన్ వెళ్లాలి. తిరగాలి అని ఉండేదని.. క్యాలిఫోర్నియాలోని బీచ్ సైడ్ ఒక ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోవాలని అనుకునే వాడిని అంటూ చెప్పాడు. కానీ కుదరక ఇక్కడికి వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. కానీ అది ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత తన నాన్న రాఘవేంద్రరావుకు తన గురించి చెప్పడంతో… తన మొదటి సినిమా కలియుగ పాండవులు స్టార్ట్ అయింది అంటూ చెప్పాడు వెంకీ. అలా ఓ చిన్న ట్రయిల్ వేస్తే అదే ఇక్కడి వరకు వచ్చిందంటూ నవ్వేశాడు ఈ విక్టరీ హీరో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.