Salman Khan: బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

Salman Khan: బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

Anil kumar poka

|

Updated on: Dec 29, 2024 | 11:56 AM

సౌత్ ఇండియాలో డైరెక్టర్‌గా తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మురుగదాస్.. మరో సారి బాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ తో సింకిందర్ సినిమాను గ్రాండ్‌ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ కూడా జెట్ స్పీడ్‌లో జరుగుతున్న ఈసినిమా నుంచి డిసెంబర్ 27నే దిమ్మతిరిగే టీజర్ బయటికి రావాల్సి ఉంది. కానీ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హఠాన్మరణంతో ఆ టీజర్ రిలీజ్‌ కాస్తా వాయిదా పడింది.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హఠాన్మరణంతో దిగ్భ్రాంతికి లోనైన సల్మాన్ టీం.. ఈ టీజర్‌ వాయిదాకి నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని తమ ట్వీట్‌ ద్వారా కన్వే చేసిన ఈ మూవీ మేకర్స్ … సికిందర్‌ టీజర్‌ను ఆ మరుసటి రోజు రిలీజ్ చేస్తానంటూ చెప్పింది. ఇక చెప్పినట్టే తాజాగా సల్మాన్ మోస్ట్ అవేటెడ్ మూవీ సికిందర్ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయడంతో.. ఇప్పుడు సల్మాన్ ఫ్యాన్స్ ఈసినిమా టీజర్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీజర్లో సల్మాన్ లుక్స్ అండ్ యాక్షన్ కు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్‌ కోసం ఈగర్‌గా వెయిట్ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక సికందర్ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోంది. ఇటీవల విడుదలైన బేబీ జాన్’ సినిమాలోనూ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. ఇప్పుడు ఈ సినిమాతో తన ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.