TOP 9 ET: దేశంలోనే అతిపెద్ద కటౌట్ దటీజ్ చరణ్ క్రేజ్! | ఎంత దారుణానికి ఒడిగడుతున్నార్రా..
గేమ్ ఛేంజర్ సినిమాను జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్నా.. మేకర్ నుంచి వైరల్ అయ్యే.. అప్డేట్స్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అలా సీరియస్ అయిన ఓ ఫ్యాన్.. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌ను బెదిరించాడు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను వెంటనే విడుదల చేయాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
01.Ram Charan: దేశంలోనే అతిపెద్ద కటౌట్ దటీజ్ చరణ్ క్రేజ్.!
రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత ఎత్తైన కటౌట్ పెడుతున్నారు. 256 ఫీట్స్‌తో ఉన్న రామ్ చరణ్ కటౌట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పుడే నెట్టింట వైరల్ అవ్వడం కూడా షురూ అయ్యాయి.
02. Pushpa 2 Nepal: నేపాల్ గడ్డపై అల్లు అర్జున్ దిమ్మతిరిగే రికార్డ్.!
విడుదలైన ప్రతీచోట రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు పుష్ప రాజ్. కేవలం మన దేశంలోనే కాదు.. పక్కనున్న నేపాల్‌లోనూ కొత్త రికార్డులు తిరగరాస్తున్నాడు మన పుష్ప. ఎవ్వరికీ సాధ్యం కానీ రేంజ్‌లో.. అక్కడ 24.75 కోట్లు వసూలు చేసి.. అత్యధిక వసూళ్లు సాధించిన ఫారెన్ సినిమాగా బన్నీ చరిత్ర సృష్టించారు. ఈ ఫీట్‌తో నేపాల్ గడ్డపై ట్రెండ్ అవుతున్నాడు మన అల్లు అర్జున్.
03.ram charan: షాకింగ్.! రామ్ చరణ్‌కు బెదిరింపు లెటర్..
గేమ్ ఛేంజర్ సినిమాను జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్నా.. మేకర్ నుంచి వైరల్ అయ్యే.. అప్డేట్స్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అలా సీరియస్ అయిన ఓ ఫ్యాన్.. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌ను బెదిరించాడు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను వెంటనే విడుదల చేయాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అంతేకాదు బ్రతికుంటే అందరితో చూస్తా.. ఛస్తే ఆత్మలా చూస్తా… ఇదంతా నీ చేతుల్లోనే ఉంది చరణ్ అన్న.. అంటూ తన బాధకు అక్షర రూపమిచ్చాడు. ఈ లెటర్‌కు రిప్ లెటర్ అని పేరు కూడా పెట్టాడు. అయితే చెర్రీ ఫ్యాన్ రాసిన ఈ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తేనే.. ఆ అభిమాని తీరును అందరూ తప్పుబట్టేలా చేస్తోంది.
04.Mega Odela: మెగాస్టార్- ఓదెల సినిమా గురించి బిగ్ అప్డేట్.!
జెస్ట్ అనౌన్స్ చేసింది మొదలు.. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోయే సినిమా గురించి.. అభిమానులు ఇప్పట్నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండనుందో అంటూ ఆరాలు తీస్తున్నారు. ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. ఇక వారి కోసమే అన్నట్టు.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్నట్టు… ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ నుంచి ఓ మాట బయటికి వచ్చింది. అంతే ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
05.NTR: జైలర్ డైరెక్టర్‌తో.. ఎన్టీఆర్ సెట్టు అంతే.!
జూనియర్ ఎన్టీఆర్ వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాకు సైన్ చేసారు తారక్. ఈ రెండు సినిమాలతో పాటు నెల్సన్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించబోతుంది. ఇదే విషయంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
06.Mokshagna: మొదటి సినిమానే స్టార్ట్ కాలే.. అప్పుడే రెండా..!
నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమానే ఇంకా మొదలు కాలేదు. కానీ అప్పుడే రెండో సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ తర్వాత.. వెంకీ అట్లూరితో రెండో సినిమా చేయబోతున్నారు మోక్షజ్ఞ. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు నాగవంశీ.
07.Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్‌కు ఆహా బంపర్ ఆఫర్.! అలా చేస్తే బాలయ్యతో ములాఖత్..
బాలయ్య డాకూ మహరాజ్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా చూడాలని ఎప్పటి నుంచో వాళ్లందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక అందుకే.. అమెరికాలోని నందమూరి అభిమానుల కోసం డల్లాస్ వేదికగా… జనవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది డాకూ టీం. ఈ క్రమంలోనే ఈ వేడుక కోసం వెయిట్ చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆహా! హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ అయిన ఆహా.. ఆహా గోల్డ్‌తో 4కె క్వాలిటీ వీడియో కంటెంట్ అందిస్తోంది. క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ అండ్ డాల్బీ సౌండ్‌తో… థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మన ముందుకు తెచ్చింది. అయితే డిసెంబర్ 31లోపు ఈ ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ యాన్‌వల్ ప్యాక్ తీసుకున్న ఎన్ ఆర్ ఐలకు బాలయ్యను కలిసే ఛాన్స్‌తో పాటు.. ఈ ఈవెంట్‌లో వీఐపీ లాంజ్‌లో సీట్ దక్కే అవకాశం ఉంటుందటూ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది ఆహా టీం. క్యాచ్ అండ్ క్లిక్ విత్ డాకూ మహరాజ్ అంటూ.. ఈ బంపర్ ఆఫర్ ను ఎక్స్‌క్లూజివ్‌గా.. యూఎస్‌లో ఉన్న తెలుగు వాళ్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ గా అందించింది ఆహా.
08.Srinidhi Shetty: శ్రీనిధికి బంపర్ ఆఫర్
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిన శ్రీనిధి శెట్టి.. ఆ తర్వాత అదే మాయ చేయడంలో విఫలమయ్యారు. సినిమాలు లేక సైలెంట్ అయిపోయారు. కానీ ఉన్నట్టుండి ఈమధ్యన బిజీ అయ్యారు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె నానితో హిట్ 3.. సిద్ధూ జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో బంపర్ ఆఫర్ పట్టారు శ్రీనిధి షెట్టి. ఈ సారి ఏకంగా రజినీ పక్కన జైలర్ 2లో సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇక జైలర్ సినిమాను డైరెక్ట్ చేసిన నెల్సనే ఈ సినిమాను మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు.
09.samantha: ఎంత దారుణానికి ఒడిగడుతున్నార్రా.!
ఒకప్పుడు మార్ఫింగ్ తో రెచ్చిపోయిన కేటుగాళ్లు.. ఇప్పుడు ఏఐ సాయంతో మరింత దారుణానికి ఒడిగడుతున్నారు. హీరోయిన్లను చాలా దారుణంగా… మారుస్తూ.. నెట్టింట వైరల్ చేస్తున్నారు. పైశాచిక ఆనందంతో పాటు.. అలాంటి వీడియోలతో పైసలు కమాయిస్తున్నారు. ఇక తాజాగా కొందరు కేటుగాళ్లు అలాంటి పనే చేసి నెట్టింట విమర్శల పాలవుతున్నారు. ఏఐ సాయంతో సమంతకు బేబీ బంప్ ఉన్నట్టు ఫోటోలు క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ నుంచి చీవాట్లు తింటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.