
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే
నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు టాక్ షోతో ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల మన్నలను పొందిన ఆహా. అన్ స్టాపబుల్ అంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. బాలయ్య షోతో ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైనమెంట్ ఇస్తుంది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు సీజన్ 4తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ షోకు చాలా మంది ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు హాజరయ్యి సందడి చేశారు. బాలయ్య తనదైన స్టైల్ లో చిలిపి ప్రశ్నలు వేసి గెస్ట్ గా వచ్చిన వారిని తికమక పెట్టారు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా హాజరయ్యి అలరించారు. అలాగే రాజకీయ ప్రముఖులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ షోలో సందడి చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 4లోనూ చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు.
Ram Charan: రామ్ చరణ్ గొప్ప మనసు.. అభిమాని భార్యకు వైద్య సాయం చేస్తానని హామీ
ఆహాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, టాక్ షోలు, గేమ్ షోలతో సందడి చేస్తుంది. ఆహాలో ఇప్పటికే ఎన్నో సక్సెస్ షోలను ప్రేక్షకులకు అందించిన ఆహా. బాలయ్య అన్ స్టాపబుల్ తో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది అన్ స్టాపబుల్. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు సీజన్ 4ను కూడా సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తుంది.
- Rajeev Rayala
- Updated on: Jan 18, 2025
- 4:08 pm
బాలయ్య చిలిపి ప్రశ్నలు, చరణ్ క్రేజీ ఆన్సర్స్.. ఆహాలో అన్ స్టాపబుల్ రామ్ చరణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్
నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు హోస్ట్ గాను ఇరగదీస్తున్నారు. ఓ వైపు వరుసగా హిట్స్ అందుకుంటున్న బాలయ్య. మరో వైపు అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోతో దూసుకుపోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతుంది.
- Rajeev Rayala
- Updated on: Jan 17, 2025
- 4:46 pm
Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినే.. హింట్ ఇచ్చిన రామ్ చరణ్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు ? ఎవరిని పెళ్లి చేసుకుంటారు ? అంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి రామ్ చరణ్ హింట్ ఇచ్చారు.
- Rajitha Chanti
- Updated on: Jan 11, 2025
- 11:13 am
Unstoppable with NBK: కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు.. బాలయ్య షోలో రామ్ చరణ్
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నఅన్ స్టాపబుల్ విత్ ఎన్సీకే కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షోలో చాలామంది సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను ఓపెన్ గా పంచుకుంటున్నారు. దీంతో బాలయ్య షోకు రికార్డు వ్యూస్ వస్తున్నాయి.
- Basha Shek
- Updated on: Jan 9, 2025
- 9:27 pm
Ram Charan: ఆ సినిమా ఎందుకు చేశానా అనిపించింది.. బాలయ్య షోలో రామ్ చరణ్..
డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ, అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జనవరి 10న విడుదలకానుంది. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ పాల్గొన్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
- Rajitha Chanti
- Updated on: Jan 9, 2025
- 6:33 am
Ram Charan: సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. అకీరా ఎంట్రీపై రామ్ చరణ్ ఏమన్నారంటే?
రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలు బాగా తగ్గించేశాడు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సేవలో మరింత నిమగ్నమయ్యారు. దీంతో పవన్ కు బదులు ఆయన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవలే రేణూ దేశాయ్ కూడా అకీరా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
- Basha Shek
- Updated on: Jan 8, 2025
- 2:20 pm
Ram Charan: ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నా.. మహేష్, ప్రభాస్ ఇద్దరిలో చరణ్ ఎవరి పేరు చెప్పాడంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చరణ్.
- Rajitha Chanti
- Updated on: Jan 8, 2025
- 11:33 am
Razakar OTT: ఎట్టకేలకు ఓటీటీలో అనసూయ కాంట్రవర్సీ సినిమా.. ‘రజాకార్’ స్ట్రీమింగ్ ఎందులోనంటే?
భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం రజాకార్. అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా తదితర స్టార్ యాక్టర్స్ ఇందులో నటించారు. గతేడాది మార్చి 15న విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
- Basha Shek
- Updated on: Jan 8, 2025
- 6:40 am
Ram Charan: సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్.. ఆ ప్రశ్నతో ఇరికించిన బాలయ్య…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు, ఈవెంట్లలో పాల్గొంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.
- Rajitha Chanti
- Updated on: Jan 7, 2025
- 11:53 am
Ram Charan-Balakrishna: క్లింకార ఫోటో రివీల్ చేసేది అప్పుడే.. బాలయ్య షోలో రామ్ చరణ్ అల్లరి.. నవ్వులే నవ్వులు.. ప్రోమో చూశారా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, దిల్ రాజు ఇటీవల అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న ఈ టాక్ షోలో రామ్ చరణ్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది.
- Rajitha Chanti
- Updated on: Jan 5, 2025
- 11:03 am