Ram Charan: ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నా.. మహేష్, ప్రభాస్ ఇద్దరిలో చరణ్ ఎవరి పేరు చెప్పాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్‏స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చరణ్.

Ram Charan: ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నా.. మహేష్, ప్రభాస్ ఇద్దరిలో చరణ్ ఎవరి పేరు చెప్పాడంటే..
Ram Charan, Mahesh, Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2025 | 11:33 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో అన్‏స్టాపబుల్ విత్ ఎన్‏బీకే. ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతుంది. నాలుగో సీజన్ లో ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్స్ కంప్లీట్ కాగా.. ఇప్పుడు తొమ్మిదో ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. అలాగే చరణ్ తోపాటు హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజు సైతం వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో ఇటీవల రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టాక్ షోలో రామ్ చరణ్ తన సినిమాలు, అలాగే కూతురు క్లింకార , పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు సమాచారం. అలాగే చరణ్ ను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడుగుతూ సరదాగా ఆటపట్టించారు బాలయ్య.

ఆ టాక్ షోలో సమంత, కియారా అద్వానీ, అలియాలలో ఉత్తమ నటి ఎన్నుకోమని అడిగారు బాలయ్య. ఇందులో సమంతను ఉత్తమ నటిగా ఎంపిక చేశాడు చరణ్. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరిలో ఒకరితో మాల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తావు అని అడగ్గా.. ఇందుకు మహేష్ బాబు అని ఆన్సర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్, ప్రభాస్ ఇద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. గతంలో ప్రభాస్ అన్‏స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు రామ్ చరణ్ కు కాల్ చేశాడు. ఇక ఇప్పుడు ఇదే షోలో చరణ్ తన స్నేహితుడు ప్రభాస్ కు కాల్ చేసి మాట్లాడాడు.

అలాగే తన కూతురు క్లింకార తనను ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో అప్పుడే తన ఫోటో రివీల్ చేస్తానని అన్నాడు చరణ్. ఇటీవలే తన తండ్రిని మొదటిసారి స్క్రీన్ పై చూసి తెగ మురిసిపోయింది క్లింకార. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్లింకార క్యూట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.