AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

ఎండలు ముదురుతున్న వేళ, చల్లని పానీయం తాగాలని ఎవరికి ఉండదు? ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఐస్‌డ్ టీలు, లాటెలు పక్కన పెడితే.. మన దేశంలో అనాదిగా వస్తున్న దేశీ పానీయాలు కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సహజ సిద్ధమైన పండ్లు, మసాలాలు, విత్తనాలతో తయారయ్యే ఈ 10 భారతీయ సాంప్రదాయ పానీయాలు ఈ వేసవిలో అమృతంతో సమానం.

వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌
Indian Summer Drinks.jpg
Nikhil
|

Updated on: Mar 11, 2026 | 10:41 PM

Share

వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కేవలం నీళ్లు తాగితే సరిపోదు. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, పేగు ఆరోగ్యాన్ని పదిలపరిచే పానీయాలు మన సొంతం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశంలో లభించే అద్భుతమైన వేసవి పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఆమ్ పన్నా- పచ్చి మామిడికాయలు, పుదీనా, జీలకర్రతో చేసే ఈ పానీయం ఉత్తర భారతీయులకు ఎంతో ఇష్టం. ఇది ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.
  2. బాబ్రి బ్యోల్- కాశ్మీరీల ఫేవరెట్ డ్రింక్ ఇది. పాలు, నీళ్లు, సబ్జా గింజలు మరియు కొబ్బరితో దీనిని తయారు చేస్తారు. ఇందులో ఉండే సబ్జా గింజలు శరీరానికి తక్షణ చలవను ఇస్తాయి.
  3.  ఫాల్సా బెర్రీస్- పుల్లగా, తీయగా ఉండే ఈ బెర్రీల పానీయం యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది వేసవిలో వచ్చే అలసటను తగ్గిస్తుంది.
  4.  జల్జీరా- పుదీనా, కొత్తిమీర, జీలకర్ర మరియు చింతపండు మిశ్రమంతో చేసే జల్జీరా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  5.  కోకుమ్ షర్బత్- మహారాష్ట్ర, గోవాలలో ప్రసిద్ధి చెందిన ఈ పానీయం ముదురు గులాబీ రంగులో ఉంటుంది. కోకుమ్ పండులో ఉండే గుణాలు కడుపులో మంటను తగ్గిస్తాయి.
  6.  సత్తు షర్బత్- దీనిని బీహార్‌లో ‘దేశీ ప్రోటీన్ షేక్’ అని పిలుస్తారు. వేయించిన శనగపిండితో చేసే ఈ పానీయం శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
  7.  మజ్జిగ- పెరుగులో జీలకర్ర, ఉప్పు, పుదీనా కలిపి చేసే మజ్జిగ ఒక సహజమైన ప్రోబయోటిక్. ఇది జీర్ణ వ్యవస్థను చల్లబరుస్తుంది.
  8.  బెల్ షర్బత్- వెలగపండుతో చేసే ఈ షర్బత్ వేసవిలో పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
  9.  సోల్‌కఢి – కొబ్బరి పాలు మరియు కోకుమ్ మిశ్రమంతో చేసే ఈ విలక్షణమైన పానీయం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
  10.  నుంగు షర్బత్- మన దగ్గర లభించే తాటి ముంజల డ్రింక్ ఇది. తాటి ముంజలు, సన్నారి సిరప్ మరియు నిమ్మరసంతో చేసే ఈ పానీయం ఎండకు విరుగుడుగా పనిచేస్తుంది.

కృత్రిమ రంగులు, చక్కెరలు ఉండే కూల్ డ్రింక్స్ కంటే మన మట్టి వాసన ఉన్న ఈ సాంప్రదాయ పానీయాలు ఎంతో మేలు. ఇవి కేవలం దాహార్తిని తీర్చడమే కాకుండా శరీరానికి రోగనిరోధక శక్తిని కూడా అందిస్తాయి. ఈ వేసవిలో మీకు నచ్చిన డ్రింక్‌ను ఒకసారి ట్రై చేసి చూడండి!

Follow Us
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..