Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. అకీరా ఎంట్రీపై రామ్ చరణ్ ఏమన్నారంటే?

రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలు బాగా తగ్గించేశాడు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సేవలో మరింత నిమగ్నమయ్యారు. దీంతో పవన్ కు బదులు ఆయన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవలే రేణూ దేశాయ్ కూడా అకీరా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Ram Charan: సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. అకీరా ఎంట్రీపై రామ్ చరణ్ ఏమన్నారంటే?
Akira Nandan, Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2025 | 2:20 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఉప ముఖ్యమంత్రి గా బిజి బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో సినిమాలు కూడా తగ్గించేశాడు. అయితే ఎన్నికల ముందు పవన్ మూడు సినిమాలకు కమిట్ అయ్యారు. సుజిత్ ఓజీ, ఉస్తాద్ గబ్బర్ సింగ్, హరి హర వీర మల్లు సినిమాలను పవన్ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవలే హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నారు పవన్. అయితే పవన్ కల్యాణ్ అభిమానుల కళ్లన్నీ ‘ఓజీ’ సినిమాపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కుమారుడు అకీరా కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ‘ఓజీ’ సినిమాపై ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఈ మూవీ ద్వారా అరంగేట్రం చేయించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో పవన్ తమ్ముడి పాత్రలో అకీరా నంద నటిస్తున్నాడని, ఇప్పటికే అకీరా యాక్టింగ్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయిందని ప్రచారం జరుగుతోంది.

కాగా అకీరా నందన్ త్వరలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లు ఇటీవల రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో రామ్ చరణ్ అకీరా ఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు. ఇక ఇటీవలే రేణూ దేశాయ్ కూడా తన కుమారుడి అరంగేట్రంపై స్పందించింది. తన కుమారుడికి ఇష్టముంటే ఎప్పుడైనా సినిమాల్లోకి రావొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్గుగానే అకీరా కొన్ని సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాడు ఇటీవల రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అకీరా కూడా హాజరయ్యాడని సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అలాగే అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సునీల్, జయరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు సమకూర్చారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.

బాలయ్య  అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .