AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ భాషాభిమానం తగలెయ్యా? ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్

భాష, ప్రాంతీయ అభిమానం పేరుతో కొందరు నెటిజన్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ లో నే మాట్లాడిందని ఒక స్టార్ హీరో కుమార్తె కూడా ట్రోలర్స్ బారిన పడింది.

మీ భాషాభిమానం తగలెయ్యా? ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
Hero Daughter
Basha Shek
|

Updated on: Jan 06, 2025 | 3:11 PM

Share

సెలబ్రిటీలు ఏ పని చేసినా విమర్శించడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాదు వారి కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో కూతురు శాన్విపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ, సుదీప్ కూతురిపై ఒక్కసారిగా నెటిజన్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఆమె ఏం తప్పు చేసింది? అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళదాం రండి. ఇటీవల జీ కన్నడ ‘సరిగమప’ షోలో స్టార్ హీరో కిచ్చా సుదీప్, ఆయన భార్య ప్రియ, కూతురు సాన్వి సందడి చేశారు ఈ సందర్భంగా సాన్వి తన తండ్రి కోసం ఓ పాటను రాగయుక్తంగా ఆలపించింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. ఈ పాట తర్వాత సాన్వి పూర్తిగా ఆంగ్లంలో నే మాట్లాడింది. ‘ప్రతివర్ష’ అనే పదం తప్ప మరే కన్నడ పదం ఉపయోగించలేదు. ఇదే ఇప్పుడు సాన్వీపై ట్రోల్‌కి కారణమైంది.

కాగా కిచ్చా సుదీప్‌ ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్స్ ఇంగ్లిష్ మాట్లాడొద్దని, కన్నడ భాషలో మాట్లాడేందుకు ప్రయత్నించాలని తరచూ చెబుతుంటారాయన. అలాంటిది కన్నడ రియాల్టీ షోలో తమ అమ్మాయిని కన్నడలో ఎందుకు మాట్లాడించలేదంటూ సుదీప్ ను ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కొందరు సుదీప్, శాన్వీకి సపోర్టుగా నిలుస్తున్నారు.    సుదీప్ కూతురు సాన్వి ఇంగ్లిషులో మాట్లాడినా కన్నడ లోనే అద్భుతంగా పాడిందని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంపై సుదీప్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

సరిగమప టీవీ షోలో సుదీప్ కూతురు..

కన్నడలోనే పాట పాడింది కదా…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..