Shreshti Verma: సూసేకీ అగ్గిరవ్వమాదిరి ఉంటాడే సాంగ్‌కు శ్రష్టి వర్మ అద్దిరిపోయే స్టెప్పులు.. వీడియో ఇదిగో
ఢీషోలో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన శ్రష్టి వర్మ జానీ మాస్టర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది. పుష్ప 2 , శర్వానంద్ మనమే తదితర సినిమాలకు కొరియోగ్రఫీ కూడా చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు డ్యాన్స్ మాస్టర్ గా ఫుల్ బిజి బిజీగా ఉంటోంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో టైటిల్ సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. ‘పుష్ప పుష్ప’ అనే పాటకు విజయ్ పోలకితో పాటు శ్రష్టి వర్మ కూడా కొరియోగ్రఫీ చేసింది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ ఫోన్ స్టెప్, షూ డ్రాప్ స్టెప్పులు బాగా హైలెటయ్యిన సంగతి తెలిసిందే. ఇక మనమే సినిమాలో శర్వానంద్ కు స్టెప్పులు నేర్పిస్తూ శ్రష్టి సెట్స్ లో తీసుకున్న వీడియో కూడా నెట్టింట బాగా వైరలయ్యింది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ డ్యాన్స్ మాస్టర్. తన డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా శ్రష్టి షేర్ చేసిన వీడియో ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది. పుష్ప-2 సినిమాలో జాతర సీన్ లో వచ్చే ‘సూసేటి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే సాంగ్ బాగా హైలెట్ గా నిలిచింది. ఈ పాటకు అల్లు అర్జున్, రష్మిక మందన్న సూపర్బ్ గా స్టెప్పులేశారు. ఇక సినిమా విడుదలయ్యాక ఈ పాటకు ఆదరణ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పాటకు స్టెప్పులేస్తూ రీల్స్ చేశారు. ఈ సాంగ్‌కు గణేశ్ మాస్టర్ కంపోజ్ చేయగా, శ్రష్టి వర్మ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించింది. కాగా ఈ సాంగ్‌కు శ్రష్టి వర్మ గతంలో రిహార్సల్ చేసిన డ్యాన్స్ వీడియోను తాజాగా తన ఇన్‌స్టాలో గ్రామ్ లో షేర్ చేసింది.
ఈ వీడియోలో శ్రష్టి వర్మ అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టింది. అలాగే ఎక్స్ ప్రెషన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. కొందరైతే రష్మిక కంటే శ్రష్టి వర్మనే బాగా పర్ఫామ్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రష్టి వర్మ డ్యాన్స్ వీడియో ఇదిగో..
View this post on Instagram
కాగా ఢీ-11లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది శ్రష్టి వర్మ. ఆ తర్వాత జానీ మాస్టర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. అన్నట్లు ఈ అమ్మడు ‘యథా రాజా తథా ప్రజా’ అనే సినిమాలోనూ నటించింది. ఇందులో జానీ మాస్టర్ హీరోగా నటించాడు.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..