Tollywood: అందం కోసం పాలతో స్నానం చేస్తోన్న హీరోయిన్.. అసలు విషయం ఇదే..
సినీరంగంలోని హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదోక విషయం చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా తారల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ ఎక్కువగా వైరలవుతుంది. అందులో ఓ హీరోయిన్ అందం కోసం పాలతో స్నానం చేస్తుందట.
ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షాలిని పాసి. ఆమె అత్యధిక నటిగా.. అలాగే భారతదేశంలో ధనిక పారిశ్రామికవేత్త భార్యగా చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో షాలిని పాసి పేరు, ఫోటోలు నిత్యం వైరలవుతున్నాయి. అలాగే, నెట్‌ఫ్లిక్స్ హిట్ రియాలిటీ షో ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ ద్వారా షాలిని పాసి మరింత పాపులర్ అయ్యింది. ఈ షో ద్వారానే షాలిని ఓ రేంజ్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో షాలిని పాసి గురించి గూగుల్ సెర్చ్ ఎక్కువగా చేస్తున్నారు నెటిజన్స్. మరోవైపు ఈ అమ్మడు గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతుంది.
షాలిని సంపదకే కాదు అందానికి కూడా పేరుంది. తన అందాన్ని కాపాడుకోవడానికి పాలతో స్నానం చేసేదని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని నేరుగా షాలిని ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దీనిపై షాలిని మాట్లాడుతూ.. ‘నేను పాలతో స్నానం చేస్తాననడం నిజం కాదు. షోలో నన్ను అడిగిన ప్రతిదానికీ నేను అవును అని చెబుతాను కాబట్టి నేను వివరించనవసరం లేదు. ఇతర తారాగణం సభ్యులకు నేను ఏమీ వివరించాల్సిన అవసరం లేదు. లేదా వివరించడానికి ఏమీ లేదు” అంటూ చెప్పుకొచ్చింది.
రూమర్స్‌కి తాను అవును అని చెప్పినప్పటికీ, షోలో తన అలవాట్ల గురించి ఎవరూ వివరంగా చెప్పనవసరం లేదని షాలిని తన సమాధానంలో స్పష్టం చేసింది. షాలిని మాట్లాడుతూ.. “నేను నివసించే ప్రాంతంలో, మాకు ఆవులు, గుర్రాలు, మేకలను ఉంచడానికి అనుమతి లేదు. ఇది నియమం. నేను పాలతో స్నానం చేయను. ఇది కేవలం ప్రచారం మాత్రమే” అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.