- Telugu News Photo Gallery Cinema photos Tollywood Young Heroes teja sajja nani sai durga tej All Hopes on 2025
2025 మీద కుర్ర హీరోల ఆశలు.. ఈ దెబ్బతో పాన్ ఇండియా స్టార్ట్ అవ్వడం పక్కా
2025లో టాలీవుడ్ హీరోల జోరు కూడా గట్టిగా కనిపిస్తోంది. రీజినల్ మార్కెట్‌లో ప్రూవ్ చేసుకున్న హీరోలు పాన్ ఇండియా రేంజ్‌ను టార్గెట్ చేస్తుంటే ఆల్రెడీ పాన్ ఇండియా ట్రెండ్‌లోనే ఉన్న హీరోలు బిగ్ మూవీస్‌తో బరిలో దిగుతున్నారు. దీంతో 2025లో చాలా మంది స్టార్ రేంజ్ మారటం పక్కా అన్నా అంచనాలు కనిపిస్తున్నాయి.
Updated on: Jan 05, 2025 | 6:28 PM

హనుమాన్ సినిమాతో గత ఏడాది సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజ సజ్జ, 2025లోనూ ఆ జోరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు.

అందుకే మరోసారి సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో నేషనల్ మార్కెట్‌లో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

ఆల్రెడీ పాన్ ఇండియా మూవీతో ప్రూవ్ చేసుకున్న నాని, మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. హిట్ సిరీస్‌లో నిర్మాతగా రెండు సూపర్ హిట్స్ అందుకున్న నేచురల్ స్టార్ ఈ సారి హీరోగానూ తానే బరిలో దిగుతున్నారు. వయలెంట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీతో నేషనల్ మార్కెట్‌లో తన ప్లేస్ కన్ఫార్మ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు.

తండేల్ సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా బరిలో దిగుతున్నారు అక్కినేని హీరో నాగచైతన్య, ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన ఈ సినిమా గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటంతో 2025కి వాయిదా పడింది.

లాంగ్ బ్రేక్ తరువాత డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్న సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు.




