Balakrishna: ‘ఆయన సినిమాలో హీరోయిన్‌గా బ్రాహ్మణికి ఆఫర్.. కానీ’.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఆహా ఆన్ స్టాపబుల్ షోకు వచ్చింది. దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్ , నిర్మాత నాగవంశీ బాలయ్యతో ముచ్చట్లు పెట్టారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ టాక్ షోలో సందడి చేశారు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ రన్ అవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, దుల్కర్ సల్మాన్, సూర్య, అల్లు అర్జున్, నవీన్ పొలిశెట్టి, శ్రీలీల, విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి సురేశ్ బాబు ఇలా పలువురు ప్రముఖులు సందడి చేశారు. తాజాగా బాలయ్య షోకు డాకు మహారాజ్ టీమ్ వచ్చింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ బాబీ కొల్లి, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య తన పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. షోలో భాగంగా ‘మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు’ అని సంగీత దర్శకుడు తమన్ బాలయ్యను దీనికి ఆన్సరిచ్చిన బాలయ్య తన ఇద్దరు కూతుళ్లను చాలా గారాబంగానే పెంచానన్నారు. ఈ క్రమంలో బ్రాహ్మిణికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందన్న విషయాన్ని బయట పెట్టారు.
‘గతంలో ఒక సినిమా కోసం హీరోయిన్‌గా బ్రాహ్మణి నటిస్తారా అని మణిరత్నం గారు నన్ను అడిగారు. సరే అని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పాను. ‘నా ముఖం అంటూ’ ఏం చెప్పకుండా వెళ్లిపోయింది. అవునూ.. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని మళ్లీ చెప్పాను. ఫైనల్‌గా తనకు సినిమాలు ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే, తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేంది. ఆ టైంలో తనైనా నటిగా వస్తుందని ఆశించాను. ఇప్పుడు ఈ షో కోసం ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు చూసుకుంటోంది. ఇక ఇంట్లో నేను ఎక్కువగా భయపడేది మాత్రం బ్రాహ్మిణికే’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
To all the Lion fans 🦁! Experience Mass vibes 🤩, mass punches , and unstoppable entertainment 🎥 now on #Aha 👉
Watch #UnstoppableS4 episode 8 now on #aha▶️ https://t.co/cMkbbCJ60O #UnstoppableWithNBKS4 #Unstoppable #UnstoppableS4 #Aha #NandamuriBalakrishna @MusicThaman… pic.twitter.com/vp7bcaDILM
— ahavideoin (@ahavideoIN) January 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.