Suriya: సూర్య పిల్లలకు ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఇంతకీ ఎవరో తెలుసా..

ఇటీవలే కంగువ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు హీరో సూర్య. భారీ అంచనాల మధ్య నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సినిమా విడుదలకు ముందే రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత అన్నారు. కానీ కేవలం రూ.100 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి.

Suriya: సూర్య పిల్లలకు ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఇంతకీ ఎవరో తెలుసా..
Suirya Fam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2025 | 7:59 PM

కోలీవుడ్ సూర్యకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అటు సూర్య సతీమణి జ్యోతిక సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. సూర్య, జ్యోతిక దంపతులకు పాప దియా, బాబు దేవ్ ఉన్న సంగతి తెలిసిందే. సూర్య పిల్లలకు సంబంధించిన ఫోటోస్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య.. తన ఇద్దరు పిల్లల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే తన పిల్లలకు ఏ హీరో ఇష్టమో చెప్పుకొచ్చారు. తన పిల్లలకు తమిళ్ హీరో విజయ్ దళపతి అంటే చాలా ఇష్టమని అన్నారు. విజయ్ నటించిన పులి చిత్రాన్ని ఎన్నోసార్లు చూశారని.. అందుకే విజయ్ ను పులి అంకుల్ అని పిలుస్తారని.. విజయ్ అంటే ఎక్కువ అభిమానం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సూర్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇక సూర్య విషయానికి వస్తే.. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. ఇది అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు. దర్శకుడు మణిరత్నం శరవణన్ పేరును సూర్యగా మార్చారు. శరవణన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుడు కాబట్టి కన్ఫ్యూజన్ రాకుండా ఉండేందుకు ఈ పేరు పెట్టారు. నటుడు సూర్య తన తొలినాళ్లలో నటనపై ఆసక్తి చూపలేదు. చిన్నప్పటి నుంచి దర్శకుడు కావాలని కలలు కన్నారు. సూర్య తన చదువు పూర్తయ్యాక నటన రంగంలోకి రాకముందు కార్మెన్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. 1997లో వసంత్ దర్శకత్వం వహించిన మణిరత్నం ‘నెరుకు నేర్’తో సూర్య సినీ రంగ ప్రవేశం చేశారు. సూర్య సినిమాల్లోకి వచ్చిన మొదటి 4 సంవత్సరాలు పెద్ద హిట్ ఇవ్వలేకపోయాడు. 2001లో విడుదలైన ‘నంద’ సినిమా సూర్య సినీ జీవితంలో కీలక మలుపు తిరిగింది. ఈ చిత్రానికి బాలా దర్శకత్వం వహించారు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన కాకా కాకా చిత్రంలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సూర్య నటించిన గజిని, సింగం వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఇటీవల సూర్య నటించిన సురారై పోటోటు చిత్రం బాలీవుడ్‌లో కూడా రీమేక్ కావడం గమనార్హం. సూర్య, జ్యోతిక 5 ఏళ్లు ప్రేమలో ఉన్నారు. 2006లో వివాహం చేసుకున్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా