- Telugu News Photo Gallery Cinema photos Arundhati Movie Child Artist Divya Nagesh Engaged To Aji Kumar, Photos Here
Divya Arundati: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?
అరుంధతి సినిమా అంటే చాలా మందికి అనుష్కా శెట్టియే గుర్తుకు వస్తుంది. అయితే ఇదే సినిమాలో జేజమ్మ’ చిన్ననాటి పాత్రలో ఒక పాప అద్భుతంగా నటించింది. తన నటనా ప్రతిభకు బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు గెల్చుకుంది. తన పేరు దివ్యనగేష్. తాజాగా ఈ నటి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది.
Updated on: Jan 03, 2025 | 10:38 PM

అరుంధతి మూవీలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి నంది అవార్డు సొంతం చేసుకున్న దివ్య నగేశ్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది.

తాజాగా ఆమె నిశ్చితార్థం తన సహ నటుడు, కొరియోగ్రాఫర్ అజి కుమార్‌తో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ప్రస్తుతం దివ్య, అజి కుమార్ ల నిశ్చితార్థం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా దివ్య, అజి కుమార లు చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మార్చుకునేందుకు రెడీ అయ్యారు.

తనకు కష్టకాలంలో ఎంతో అండగా నిలిచిన అజి, ఇప్పుడు తన జీవిత భాగస్వామి కాబోతుండడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది దివ్య నగేశ్.

కాగా త్వరలోనే దివ్య, అజి కుమార్ ల వివాహం జరగనుందని తెలుస్తోంది. కాగా అరుంధతి తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది దివ్య. అయితే పెద్దగా సక్సెస్ రాలేదు.





























