- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines raashii khanna, krithi shetty, pooja hegde, waiting for hits in 2025
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
అయిందేదో అయిపోయింది.. 2024 వెళ్లిపోయింది.. మరి వచ్చిన కొత్త ఏడాదైనా ఫ్లాపుల్లో ఉన్న ముద్దుగుమ్మలకు కలిసొస్తుందా..? వరస పరాజయాలతో రేసు నుంచి తప్పుకున్న హీరోయిన్ల కెరీర్‌కు కొత్త ఆశలు చిగురిస్తాయా..? అసలు ఫ్లాపుల్లో ఉన్న ఆ బ్యూటీస్ ఎవరు..? వాళ్ల బాధలేంటి..? ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో హ్యాట్రిక్ అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులొచ్చాయి.
Updated on: Jan 03, 2025 | 9:48 PM

అయిందేదో అయిపోయింది.. 2024 వెళ్లిపోయింది.. మరి వచ్చిన కొత్త ఏడాదైనా ఫ్లాపుల్లో ఉన్న ముద్దుగుమ్మలకు కలిసొస్తుందా..? వరస పరాజయాలతో రేసు నుంచి తప్పుకున్న హీరోయిన్ల కెరీర్‌కు కొత్త ఆశలు చిగురిస్తాయా..? అసలు ఫ్లాపుల్లో ఉన్న ఆ బ్యూటీస్ ఎవరు..? వాళ్ల బాధలేంటి..?

ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో హ్యాట్రిక్ అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులొచ్చాయి. వరసగా వచ్చిన సినిమా వచ్చినట్లు ఫ్లాప్ అవుతూనే ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్‌పై వరుస ఫ్లోప్స్ తో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ తెలుగు పై ఆశలొదిలేసి తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లారు కృతి శెట్టి. ఇక కొత్త ఏడాది జాతకం మారి మంచి విజయాలు దక్కుతాయని ఆశిస్తున్నారీమె.

అలాగే పూజా హెగ్డే కూడా అంతే. పూజా హెగ్డే జాతకం 2022 తర్వాత మారిపోయింది. 2025లో ఈమె సూర్య, విజయ్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి స్టార్స్‌తో నటిస్తున్నారు. వీటిలో తన లక్ మార్చే సినిమా కోసం చూస్తున్నారు.

ఇక రాశీ ఖన్నా చాన్నాళ్ళ తర్వాత తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో తెలుసు కదాలో నటిస్తున్నారు. అలాగే మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే సైతం ఈ ఏడాది 3 సినిమాలతో రానున్నారు.




