Actress: ‘ఆ సౌత్ డైరెక్టర్ అర్ధరాత్రి ఫోన్ చేసి హోటల్‌కు రమ్మన్నాడు’.. ప్రముఖ నటి సంచలన ఆరోపణలు
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. చాలా మందికి ఇక్కడి తారల తళుకులే కనిపిస్తాయి.కానీ వాటి వెనక ఎవరికీ తెలియని చాలా విషయాలుంటాయి. ముఖ్యంగా టీమణులు తమ కెరీర్‌లో ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొంటారు. తాజాగా ఓ ప్రముఖ నటి తనకు ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని పంచుకుంది.
ఉపాసన సింగ్..ఈ పేరు తెలుగు ఆడియెన్స్‌కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. హిందీ సినిమాలు, సీరియల్స్ చూసే వారు ఇట్టే గుర్తు పడతారు.కపిల్ శర్మ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. అంతేకాదు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ‘జుడ్వా’, ‘జుదాయి’, ‘మేన్ ప్రేమ్ కీ దీవానీ హూన్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఉపాసన నటించింది. ఇదిలా ఉంటే ఆమె ఇంటర్వ్యూ ఒకటి చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఆమె తన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. ఒక సౌత్ డైరెక్టర్ నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడని, అతనిది మా నాన్న వయసని అని చెప్పుకొచ్చింది. ఉపాసన్ సింగ్ చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ కెరీర్‌లో తనకు ఎదురైన వివిధ అనుభవాల గురించి చెప్పింది. దీంతో పాటు పలు సంచలన విషయాలు కూడా బయటపెట్టింది. ఇదే ఇంటర్వ్యూలో తన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పింది.
ఉపాసన్ సింగ్ తన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడుతూ.. । అనిల్ కపూర్ సరసన నన్ను కథానాయికగా ఎంచుకున్నారని దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు మాటిచ్చారు. కాబట్టి నేను చాలా సంతోషించాను. అయితే నేను ఏ దర్శకుడిని కలవడానికి వెళ్లినా నాతో మా అమ్మ లేదా సోదరి వెంట వచ్చేవారు. ఒక రోజు అతను నన్ను ఎప్పుడూ ఎందుకు మీ అమ్మను తీసుకొని వస్తావు అని అడిగాడు. రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని చెప్పి తన హోటల్‌కు రమ్మని అడిగాడు. నా వద్ద కారు లేదని.. రేపు ఉదయం ఆఫీస్‌కు వచ్చి కథ వింటానని చెప్పాను. కానీ దానికి ఆయన.. నీకు సిట్టింగ్‌కు సరైన మీనింగ్ తెలియదా?’ అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దర్శకుడితో మాటలకు నేను షాక్ అయ్యాను. రాత్రంతా నిద్రపోలేదు’
‘ ఆ మరుసటి ఉదయం నేను నేరుగా డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లిపోయాను. దాదాపు ఐదు నిమిషాల పాటు పంజాబీలో అతనిని అందరి ముందే తిట్టి పడేశాను. అయితే ఆ తర్వాత అనిల్ కపూర్ ప్రాజెక్ట్ నా చేయి జారిపోవడంతో చాలా బాధపడ్డాను. దీని తర్వాత రాత్రంతా ఏడుస్తూ ఏడు రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయాను’ అని చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది ఉపాసన. అయితే ఆ సౌత్ డైరెక్టర్ పేరును మాత్రం రివీల్ చేయలేదీ అందాల తార.
ఉపాసన సింగ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.