Deepika Padukone: 38 ఏళ్లకే రూ.500 కోట్లకు యజమాని.. దీపికా ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి చెప్పక్కర్లేదు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న దీపికా.. షారుఖ్ ఖాన్ సరసన అత్యధిక చిత్రాల్లో నటించింది. ఇన్నాళ్లు హిందీలో అగ్ర కథానాయికగా సత్తా చాటిన ఈ అమ్మడు ఇటీవలే తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈరోజు దీపికా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈసారి దీపికా పుట్టినరోజు వేడుకలు మరింత ప్రత్యేకం. ప్రస్తుతం తల్లిగా తన బిడ్డతో కలిసి సదదాగా గడుపుతుంది దీపికా. 2006లో ఐశ్వర్య సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది దీపికా. కన్నడ సినిమాతోనే సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన దీపికా.. షారుఖ్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం మూవీ హిందీ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే షారుఖ్ జోడిగా కనిపించిన దీపికా.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించింది.
‘కాక్‌టెయిల్’, ‘యే జవానీ హై దీవానీ’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’, ‘పఠాన్’, ‘కల్కి 2898 AD’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. దీపికా పదుకొణె ఆస్తి దాదాపు 500 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అంటున్నారు. ఒక్కో సినిమాకు రూ.15-30 కోట్లు తీసుకుంటుంది. 2016లో ఒక్కో మూవీకి రూ.10 కోట్లు తీసుకుందట. దీపికా పదుకొణె బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. ఇందుకు గాను రూ.8 కోట్లు అందుకోనున్నారు. గత మూడేళ్లలో ఆమె ఆస్తులు 30% పెరిగాయి. 2022లో దీపికా పదుకొణె ఆస్తులు 357 కోట్ల రూపాయలు. ఇప్పుడు రూ.500 కోట్లు దాటింది.
దీపికా పదుకొణె 2013లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. దాని విలువ రూ.16 కోట్లు. బాంద్రాలో ఆమెకు రూ.119 కోట్ల విలువైన ఇల్లు ఉంది. ఇది షారుఖ్ ఇంటికి సమీపంలో ఉంటుంది. అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. దీపిక దగ్గర రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ వంటి కార్లు ఉన్నాయి. దీపికా పదుకొణె చాలా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతోంది. నివేదిక ప్రకారం దీపిక దాదాపు రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టింది. తన భర్త రణవీర్ కంటే ఎక్కువ ధనవంతురాలు. ఇద్దరి ఆస్తులు కలిపితే 745 కోట్ల రూపాయలు. ఇందులో దీపికాది రూ.500 కోట్లు, రణ్‌వీర్‌ది రూ.245 కోట్లు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.