Tollywood: అతడి పేరు వింటే పూనకాలే.. ఒకప్పుడు బైక్ మెకానిక్.. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.150 కోట్ల రెమ్యునరేషన్..
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ హీరో చాలా ప్రత్యేకం. అతడి పేరు వింటే అభిమానులకు పూనకాలే. ఇక ఈ హీరో సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఒకప్పుడు బైక్ మెకానిక్.. కానీ ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.150 కోట్ల పారితోషికం తీసుకునే రేంజ్ హీరోగా ఎదిగాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో అతడు ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ సికింద్రాబాద్ కుర్రాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్నో సవాళ్లు, అవమానాలను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ బేస్ హీరో. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఈ కుర్రాడు మరెవరో కాదండి.. కోలీవుడ్ స్టార్ అజిత్.
1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించారు అజిత్. తండ్రి పి.సుబ్రమణ్యం కేరళకు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి చదువుపై అంతగా ఆసక్తి లేని అజిత్.. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత బైక్ మెకానిక్ గా పనిచేశాడు. చదువులో ప్రావీణ్యం లేకపోయినా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడతాడు. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు. హీరోగానే కాదు.. అజిత్ ప్రొఫెషనల్ రేసర్. 2004లో బ్రిటిష్ ఫార్ములా 3, ఫార్ములా 2 రేసుల్లో పాల్గొన్నాడు. అలాగే అజిత్ ప్రొఫెషనల్ షూటర్. తమిళనాడులో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో అజిత్ 4 బంగారు పతకాలు సాధించాడు. అజిత్ విమానాన్ని సైతం నడపగలడు.
బైక్ మెకానిక్ గా పనిచేసిన అజిత్.. ఆ తర్వాత టైలర్ షాపులో సేల్స్ మ్యాన్ గా చేరాడు. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీలో వర్క్ చేశాడు. గార్మెంట్ కంపెనీలో అప్రెంటిస్ గా చేరాడు. ఆ తర్వాత బిజినెస్ డెవలపర్ గా వర్క్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. సొంతంగా టెక్స్ టైల్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. ఒక మోటార్ కంపెనీకి కమర్షియల్ యాడ్ చేయడానికి వెళ్లినప్పుడు సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ పీసీ శ్రీరామ్ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. 1990 ఎన్ వీడు ఎన్ కనవర్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాకు రూ.2500 పారితోషికం తీసుకున్నాడట. మొదట్లో సైడ్ రోల్స్ చేసి ఆ తర్వాత హీరోగా మారాడు. 2000లో తన సహనటి బేబి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అజిత్. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.